బెంగళూరులో గ్యాస్ సిలిండర్ పేలుడు, ఇంటి యజమాని అరెస్టు, అనుమతి లేదు, ఇల్లు కట్టాడు!
బెంగళూరు: బెంగళూరు నగరంలోని ఈజీపుర ప్రాంతంలో సోమవారం ఉదయం వంట గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు మరణించిన కేసులో ఇంటి యజమానిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని వివేక్ నగర పోలీసులు మంగళవారం ఇంటి యజమాని గణేష్ ను అరెస్టు చేశారు.
బీబీఎంపీ అనుమతి లేకుండా మూడు అంతస్తుల భవనం నిర్మించారని, నాసికరంగా నిర్మించిన ఇంటిని అద్దెకు ఇచ్చారని ఆరోపిస్తూ పోలీసులు గణేష్ మీద ఐపీసీ 304 ఎ, 336, 339 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. మూడు అంతస్తులు కుప్పకూలడంతో ఏడు మంది మరణించారు.

ఆరు మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఇంటి యజమాని గణేష్ ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఒక అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలడంతో మూడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయిందని, చుట్టుపక్కల ఇళ్లు దెబ్బతిన్నాయని పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications