వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Cyrus Mistry's Autopsy : సైరస్ మిస్త్రీ ప్రాణం పోయిందిలా.. అటాప్సీ రిపోర్ట్ లో వెల్లడి

|
Google Oneindia TeluguNews

ఆదివారం అహ్మదాబాద్ -ముంబై జాతీయ రహదారిపై జరిగిన ఘోర కారు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు స్నేహితుడు పండోలే కూడా చనిపోయారు. మెర్జిడెస్ కారు వెనుక సీటులో కూర్చున్న వీరిద్దరూ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రమాదంలో చనిపోయినట్లు పోలీసులు ప్రాధమిక నివేదికలో తేల్చారు.

తాజాగా సైరస్ మిస్త్రీ కారు ప్రమాదానికి సంబంధించి ముంబై పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా మిస్త్రీ భౌతిక కాయాన్ని శవపరీక్ష కోసం పంపారు. ఇందుకు సంబంధించిన అటాప్సీ నివేదిక కూడా బయటికొచ్చింది. ఇందులో కీలక విషయాలు వెలుగుచూశాయి. సైరస్ మిస్త్రీ మరణానికి గల కారణాలను అటాప్సీ నివేదిక వెల్లడించింది. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ, ఆయన స్నేహితుడు జహంగీర్ పండోల్ మరణాలు "తీవ్రమైన తల గాయం, ముఖ్యమైన అవయవాలకు అనేక బాహ్య, అంతర్గత గాయాల కారణంగా" సంభవించాయని శవపరీక్ష నివేదిక తెలిపింది.

Cyrus Mistrys Autopsy : multiple fractures and injuries to vital organs led to death

సైరస్ మిస్త్రీ, అతని స్నేహితుడు జహంగీర్ పండోల్‌ల మృతదేహాలను సోమవారం అర్ధరాత్రి పాల్ఘర్‌లోని కాసా ఉప-జిల్లా ఆసుపత్రి నుండి తీసుకువచ్చిన తర్వాత ప్రభుత్వ జెజె ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం జరిగింది. మిస్త్రీ విషయానికి వస్తే, శవపరీక్షలో తలకు తీవ్ర గాయం అయినట్లు వెల్లడైంది. ఇది రక్తస్రావానికి దారితీసిందని తేల్చారు. ఛాతీ, తల ప్రాంతం, తొడ, మెడలో బహుళ పగుళ్లు గుర్తించారు. జెజె ఆసుపత్రికి చెందిన వైద్యుల నివేదిక ప్రకారం కారు 100 నుండి సున్నాకి వెళ్లినప్పుడు శరీరంలో పెద్ద కుదుపు వచ్చినప్పుడు ఈ రకమైన గాయాలు సంభవిస్తాయని చెప్పారు.

విసెరా నమూనాలను కాలినాలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కు పంపనున్నట్లు జేజే అధికారులు తెలిపారు. రసాయనాలు, ఆల్కహాల్, విషం జాడలను తనిఖీ చేయడానికి విసెరా విశ్లేషణ చేస్తారు. డీఎన్‌ఏ విశ్లేషణ కోసం నమూనాలను కూడా ఉంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదివారం ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై కారు ప్రమాదంలో మెర్సిడెస్ SUV వెనుక సీటులో కూర్చున్న సైరస్ మిస్త్రీ, జహంగీర్ పండోల్ అక్కడిక్కడే
మరణించారు.

English summary
cyrus mistry's autopsy report revealed that multiple fractures and injuries to vital organs led to his death in car accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X