వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాటా నుంచి తొలగింపు: పెదవి విప్పిన సైరస్ మిస్త్రీ

|
Google Oneindia TeluguNews

ముంబై: టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తనను ఉన్నపళంగా తొలగించడంపై వస్తున్న పుకార్లను సైరస్ మిస్త్రీ కొట్టి పారేశారు. అతను మంగళవారం నాడు ఓ మీడియా ప్రకటన విడుదల చేశారు. ఈ 24 గంటలు జరిగిన తతంగమంతా ఆశ్చర్యకరమైనది కానప్పటికీ, చాలా సెన్సిటివ్ అని ఆయన పేర్కొన్నారు.

ఉద్యోగులకు టాటా లేఖ, సైరస్ మిస్త్రీని ఎందుకు తప్పించారంటే..!ఉద్యోగులకు టాటా లేఖ, సైరస్ మిస్త్రీని ఎందుకు తప్పించారంటే..!

ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అగౌరవమైన రీతిలో మిస్త్రీని తొలగించారని, దీనిపై పల్లోంజి గ్రూపు, మిస్త్రీ కోర్టులో సవాలు చేయనున్నట్లు పలు టీవీ ఛానల్సులో వచ్చింది. మధ్యాహ్నం లోపు ఆయన మంబై హైకోర్టు ఆశ్రయించనున్నట్లు పేర్కొన్నాయి.

Cyrus Mistry breaks his silence, rubbishes rumours about suing Tatas for his abrupt ouster

కానీ వ్యాజ్యాన్ని దాఖలు చేయడానికి పబ్లిక్ ప్రకటన తప్పనిసరి అని షాపూర్జీ పల్లోంజీ గ్రూప్, మిస్త్రీ పేర్కొన్నారు. షాపూర్జీ గ్రూప్ కానీ, సైరస్ మిస్త్రీ గ్రూప్ కానీ ఇప్పటి వరకు కోర్టుకు వెళ్లినట్లు ఎలాంటి ప్రకటన చేయలేదని, వ్యాజ్యాన్ని దాఖలు చేస్తామనే మీడియా ఊహాగానాలకు ఎలాంటి ఆధారాలు లేవని పల్లోంజీ గ్రూప్ తెలిపింది. కోర్టుకు వెళ్లాలంటే పబ్లిక్ ప్రకటన తరప్పనిసరి అని గ్రూప్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

కాగా, టాటా గ్రూప్, సైరస్ మిస్త్రీలు కోర్టులో తమ వాదనలు వినిపించుకోవడానికి ముందస్తుగా జాగ్రత్తలు పడినట్లు తెలుస్తోందని వార్తలు వచ్చాయి. టాటా గ్రూప్ హైకోర్టులో ముందస్తుగా కెవియట్ పిటిషన్‌ను దాఖలు చేయగా, మిస్త్రీ కూడా టాటా సన్స్‌కు, రతన్ టాటాకు, సర్ దోరాబ్జీ ట్రస్టులకు వ్యతిరేకంగా నాలుగు కేవియట్ పిటిషన్లు సుప్రీంలో దాఖలు చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. కానీ తాను ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని మిస్త్రీ పేర్కొన్నారు.

English summary
Cyrus Mistry breaks his silence, rubbishes rumours about suing Tatas for his abrupt ouster.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X