సైరస్ మిస్త్రీ కుటుంబ జీవితాన్ని త్యాగం చేశారు: సుప్రియా సూలే
ముంబై: టాటా సన్స్ గ్రూప్‌ను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు, ఆ సంస్థను లాభాల బాట పట్టించేందుకు సైరస్ మిస్త్రీ తన కుటుంబాన్ని కూడా పట్టించుకోలేదని, కంపెనీ కోసం సమయం కేటాయించారని ఆయన స్నేహితురాలు, ఎంపీ సుప్రియా సూలే బుధవారం నాడు అన్నారు.
ఆయన కుటుంబ జీవితాన్ని కూడా త్యాగం చేశారన్నారు. సైరస్ మిస్త్రీ పని తీరు బాగాలేదని చెప్పడం ఏమాత్రం సరికాదన్నారు. మిస్త్రీ, ఆయన భార్య రోహికా చాగ్లా తనకు మంచి మిత్రులు అని చెప్పారు. మిస్త్రీ తన కుటుంబ వ్యాపారాలను కూడా విజయవంతంగా నడిపిస్తున్నారని చెప్పారు.

టాటా గ్రూప్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఆయన చాలా కష్టపడ్డారని అన్నారు. ఆయన తన సొంత వ్యాపారాలను కూడా పక్కన పెట్టారని చెప్పారు. కాగా, సైరస్ మిస్త్రీని హఠాత్తుగా చైర్మన్ పదవి నుంచి తప్పించడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications