ముడుపుల కేసు: ఆయుధ డీలర్ భండారి, శాంసంగ్ ఇంజనీరింగ్, ఓఎన్జీసీ అధికారులపై సీబీఐ ఎఫ్ఐఆర్
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారికి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మరో ఉచ్చు బిగించింది. ఓఎన్జీసీ ప్రాజెక్టులో ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఆయనతోపాటు సౌత్ కొరియాకు చెందిన శాంసంగ్ ఇంజనీరింగ్ కంపెనీ, ఓఎన్జీసీకి చెందిన గుర్తుతెలియని అధికారులపైనా బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో 2009వ సంవత్సరంలో గుజరాత్ లో తలపెట్టిన ఓఎన్జీసీ ప్రాజెక్టు(దహేజ్ ప్రాజెక్టు)కు సంబంధించి విదేశీ కన్సార్టియంతో ఓఎన్జీసీ సంస్థ కుదుర్చుకున్న రూ.6,744కోట్ల ఒప్పందం వెనుక ముడుపుల వ్యవహారం నడిచినట్లు సీబీఐ ఆధారాలు సేకరించింది. అందులో రాబర్ట్ వాద్రా, ఆయన అనుయాయులకు లంచాలు అందాయని ఈడీ ఆరోపిస్తోంది. అలా పెట్రోలియం, డిఫెన్స్ రంగాల్లో ఒప్పందాల ద్వారా వాద్రా భారీగా లబ్ధి పొందారని, ఆ సొమ్ముతోనే లండన్‌లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు కొనుగోలు చేశారన్న బీజేపీ ఆరోపణల మేరకు సీబీఐ, ఈడీలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి.

ముడుపుల వ్యవహారంలో ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారి చక్రం తిప్పారని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని తన కంపెనీ సాన్‌టెక్ ఇంటర్నేషనల్ కు నిధులు మళ్లించి, వర్టెక్స్ అనే మరో ప్రైవేటు సంస్థ నుంచి బ్రయాన్‌స్టోన్ స్క్వేర్‌లోని బంగళాను సాన్‌టెక్ కొనుగోలు చేసిందని... ఆ తర్వాత వర్టెక్స్ షేర్లు స్కైలైట్ ఇన్వెస్ట్‌మెట్ సంస్థకు బదిలీ అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. స్కైలైట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థకు విదేశాల్లో స్థిరపడిన భారతీయ వ్యాపారవేత్త సీ తంపి నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో సౌత్ కొరియా కంపెనీ శాంసంగ్ ఇంజనీరింగ్ లిమిలెడ్ పాత్ర కూడా నిర్ధారణ కావడంతో సీబీఐ ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Recommended Video
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications