వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.30 వేలు కట్టి క్యాబ్‌లో వస్తే.. సొంతింట్లో పరాభావం, భర్తను ఇంట్లోకి రానీయని అభివన సతీ...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కాపురాల్లో కూడా చిచ్చుపెడుతున్నాయి. అవును లాక్‌డౌన్ సందర్భంగా ఇతరచోట్ల చిక్కిన ఆలుమగలు.. కలుసుకొనే వీలులేకుండా పోయింది. ఒకవేళ సాహసించి ముందుకొచ్చినా ఓ భర్తకు పరాభావం ఎదురైంది. తనతో మూడు మూళ్లు వేయించుకొని, ఏడడుగుల నడిచిన భార్యే.. భర్తను లోపలికి రానీయలేదు. ఇందులో ట్వీస్ట్ ఏంటంటే.. సదరు భర్తకు కరోనా నెగిటివ్ వచ్చినా.. ఆ అభినవ సతీ అనుమతించకపోవడం విశేషం.

ఇదీ విషయం..

ఇదీ విషయం..

అగర్తాలలో తన అత్తగారింట్లో గోబింద్రా దేబ్‌నాథ్ ఫ్యామిలీతో ఉంటున్నాడు. ఇతనికి భార్య మంపీ దెబ్ నాథ్, కూతురు, అత్త, మామ ఉన్నారు. అయితే లాక్ డౌన్ విధించే ముందు దేబ్ నాథ్ అసోంలోని తన బావమరిది ఇంటికి వెళ్లాడు. లాన్ డౌన్ వల్ల రెండునెలలు సిలాపాథర్ వద్ద ఉన్నాడు. భార్య, పిల్లలపై ప్రేమతో రావాలని అనుకొన్నాడు. కానీ భార్య వద్దని చెప్పింది. ఏమవుతుందిలే అనుకొని రావడమే తప్పయిపోయింది. ఎక్కడ వైరస్ ఉందోనని.. ఇంట్లోకి రానీయలేదు.. అభినవ సతీ మంపీ దెబ్ నాథ్.

క్యాబ్‌లో రూ.30 వేలు

క్యాబ్‌లో రూ.30 వేలు

ఇతర రాష్ట్రాల నుంచి రావడానికి వలసకూలీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ పర్మిషన్ తీసుకొని రావడానికి లేటవుతోందని.. భావించి క్యాబ్ బుక్ చేశాడు. అసోం నుంచి క్యాబ్‌లో ప్రయాణించేందుకు రెండురోజులు పట్టింది. క్యాబ్ ఫీజు కూడా వాచింది. డ్రైవర్ రూ.30 వేల బిల్లు వేశాడు. ఫరావలేదు అనుకొని.. ఇంటికి చేరుకోగా.. అసలు సీన్ మొదలైంది. ఇంట్లోకి వచ్చేందుకు భార్య ససేమిరా ఒప్పుకోలేదు. అంతేకాదు కాలనీ వాళ్లతో చెప్పించి.. గొడవ కూడా చేయించింది. చిన్న పిల్లలు, వృద్దులు ఉన్నారని.. క్వారంటైన్‌లోకి వెళ్లాలని చెప్పడంతో.. విస్తుపోవడం ఆ భార్య పనయిపోయింది.

నెగిటివ్ వచ్చినా..

నెగిటివ్ వచ్చినా..

అసోం నుంచి వచ్చేప్పడు రాష్ట్ర సరిహద్దులో చూరైబరి చెక్ పోస్ట్ వద్ద దేబ్ నాథ్‌కు టెస్ట్ చేశారు. అతనికి నెగిటివ్ ఉంటేనే వెళ్లేందుకు అనుమతిచ్చారు. కానీ భార్య నుంచి ఊహించని ట్వీస్ట్ ఎదురైంది. తనను చూసి భార్య భయపడ్డారని.. పిల్లు ఏడ్డాచరని చెప్పి దెబ్ నాథ్ వాపోయాడు. అయితే దేబ్ నాథ్ వాదనలను అతని భార్య ఖండించారు. తాను అమ్మగారింట్లో ఉంటున్నానని, చిన్న పిల్లలు, అమ్మ తనతో ఉన్నారని పేర్కొన్నారు. అమ్మకు ఆరోగ్యం బాగోలేదని, ఇటీవల సర్జరీ కూడా అయ్యిందని వివరించారు. అందుకోసమే క్వారంటైన్‌కు వెళ్లాలని సూచించానని పేర్కొన్నారు. తన ఇంటిలో 14 రోజులు ఉంచుకోలేనని.. అందుకే బయటకు వెళ్లాలని సూచించానని ఖరాకండిగా చెప్పేసింది.

Recommended Video

Vande Bharat Mission : 118 Indian citizens from San Francisco arrive in Hyderabad
 క్వారంటైన్ కోసం పంపించడం

క్వారంటైన్ కోసం పంపించడం


దేబ్ నాథ్ భార్య వాదనను మరికొందరు తప్పుపడుతున్నారు. అతనికి నెగిటివ్ వచ్చినా.. క్వారంటైన్ కోసం పంపించడం సరికాదని చెబుతున్నారు. నెగిటివ్ రాగా.. 14 రోజుల క్వారంటైన్‌కి పంపించడంతో ఆంతర్యం ఏముందని ప్రశ్నిస్తున్నారు. తన భర్తను ఇంట్లోకి అనుమతించని భార్య మంపి దేబ్ నాథ్ వార్తల్లో నిలిచారు. ఆమె వాదనను సమర్థించేవారి కన్నా వ్యతిరేకించే వారు ఎక్కువ మంది ఉన్నారు.

English summary
Gobinda Debnath spent Rs 30,000 out of his pocket to hire a car and two days on the road to reach his residence in Tripura’s Agartla
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X