• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డైలీ హంట్-ట్రస్ట్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు: ప్రధాని మోడీ వెనుకే దేశ ప్రజలు

|

నవంబర్ 1,2018 ఢిల్లీ: డైలీ హంట్, భారత నెంబర్ 1 ప్రాంతీయ భాష వార్తా మరియు కంటెంట్ అప్లికేషన్ "ట్రస్ట్ ఆఫ్ ది నేషన్ " పేరుతో నీల్సన్ ఇండియాస్ అనే సంస్థతో సంయుక్తంగా నిర్వహించిన రాజకీయ సర్వేకు సంబంధించి ఫలితాలు ప్రకటించింది. ఈ సర్వే భారతదేశంలోనే కచ్చితమైన సర్వేగా పేరుగాంచడమే కాదు ఇది దేశంలో తొలిసారిగా ఒక స్వతంత్ర రాజకీయ డిజిటల్ సర్వే అని చెప్పొచ్చు. ఇందులో దేశం నుంచి ఓవర్సీస్ నుంచి దాదాపు 54 లక్షల మంది ప్రజలు పాల్గొని వారి స్పందన తెలియజేశారు.

Dailyhunt Survey Reveals 50 Percent Citizens Want Narendra Modi Second Term

దేశం నలుమూలలకు వెళ్లి చేసిన నాణ్యమైన సర్వే. ముఖ్యంగా భారత్‌లోని రెండో శ్రేణి పట్టణాలకు మూడో శ్రేణి పట్టణాలు నగరాలకు వెళ్లి ఓటర్ల నాడి తెలుసుకోవడం జరిగింది. మెట్రో నగరాల్లోనే కాకుండా తొలిసారిగా ఓటు వేయనున్న వారి నాడిని కూడా తెలుసుకోవడం జరిగింది.

Dailyhunt Survey Reveals 50 Percent Citizens Want Narendra Modi Second Term

సర్వే జరిగిన విధానం:

* డైలీ హంట్ నీల్సన్ ఇండియ సంయుక్తంగా సర్వేను రూపొందించారు, ఇది డైలీ హంట్ సైట్‌పై ఉంచారు. ఇది మొత్తం 10 భాషల్లో జరిగింది. ఇంగ్లీషు, హిందీ, తెలుగు, కన్నడ, బంగ్లా, గుజరాతి, మరాఠీ, తమిళం, మళయాలం, ఒరియా భాషల్లో ఉంచారు.

Dailyhunt Survey Reveals 50 Percent Citizens Want Narendra Modi Second Term

* డైలీ హంట్ సమాచారం సేకరించి నీల్సన్‌‌కు పంపింది

* సమాచారాన్ని పొందిన నీల్సన్ ఇండియా ఒక సర్వేను రూపొందించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలను జోడించింది

* ఇక ఓటర్లు 18-24,25-34,35 ఏళ్లు పైబడిన వారు పాల్గొన్నారు.

Dailyhunt Survey Reveals 50 Percent Citizens Want Narendra Modi Second Term

* "ట్రస్ట్ ఆఫ్ ది నేషన్" ఓటర్లకు 10 ప్రశ్నలు సంధించారు. సమాధానం ఇచ్చేందుకు నాలుగు సమాధానాలు మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో కూడా ఇచ్చారు.

డైలీ హంట్ ట్రస్ట్ ఆఫ్ ది నేషన్ సర్వే హైలైట్స్:

* 2014తో పోలిస్తే మళ్లీ అదే స్థాయి లేదా కొంచెం ఎక్కుగా అంటే 63 శాతం మంది ఓటర్లు నరేంద్ర మోడీకి మద్దతు తెలిపారు. ఈయన నాయకత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లలో మోడీ పాలన భేష్ అన్నారు.

* నరేంద్ర మోడీ నాయకత్వంలోనే భారత్‌కు మంచి భవిష్యత్తు ఉందని 50 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు.

* ఓటర్లు వినియోగించే ఫోన్లు ఆధారంగా ఆదాయం అంచనా వేశాం. తక్కువ లేదా మధ్య శ్రేణి ధరల ఫోన్లు వినియోగిస్తున్న 90 శాతం మంది ఓటర్లు నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతున్నారు. ఇది హైఎండ్ ఫోన్ వాడుతున్న వారికంటే ఎక్కువగా ఉంది.

Dailyhunt Survey Reveals 50 Percent Citizens Want Narendra Modi Second Term

* నమ్మకం, విశ్వాసం అనే రెండు అంశాలపై ఉత్తరం, దక్షిణం, పశ్చిమం, తూర్పు భారతంలో సర్వే జరిగింది.

Dailyhunt Survey Reveals 50 Percent Citizens Want Narendra Modi Second Term

* దేశం నుంచి అవినీతిని నిర్మూలించగలిగే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నరేంద్ర మోడీనే అని 60 శాతం మంది ప్రజలు భావిస్తున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అవినీతి నిర్మూలనలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటే ఆప్ అధినేత కేజ్రీవాల్‌కే ప్రజలు మద్దతు తెలిపారు.

Dailyhunt Survey Reveals 50 Percent Citizens Want Narendra Modi Second Term

* దేశం సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో దేశాన్ని ముందుకు నడిపించగల సత్తా ఒక్క నరేంద్ర మోడీకే ఉందని 62శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ(17%), అరవింద్ కేజ్రీవాల్ (8%), అఖిలేష్ యాదవ్ (3%), మాయావతి (2%).

భారత్ బియాండ్ ఇండియా పేరుతో ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో భారత్‌లో అతిపెద్ద స్వతంత్ర రాజకీయ డిజిటల్ సర్వే ట్రస్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వే నిర్వహించిందని డైలీ హంట్ అధ్యక్షుడు ఉమాంగ్ బేడీ తెలిపారు. భారత్‌లో నిజమైన నాయకుడుని ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారో తమ సర్వే ద్వారా స్పష్టంగా వెల్లడించామని ఉమాంగ్ బేడీ తెలిపారు. భారత్‌లో ఓటర్ల నాడిని పెద్ద ఎత్తున తెలుసుకోవడం జరిగిందన్నారు. జనాభా, సామాజిక, నగర, రాష్ట్ర మరియు భాష అంశాలను పరిగణలోకి తీసుకుని నాణ్యమైన సర్వేను చేసినట్లు తెలిపారు. భారీ ఎత్తున చేసిన సర్వే విషయంలో తమకు సహకరించిన రీసెర్చ్ సైన్స్ పార్ట్‌నర్ నీల్సన్ ఇండియాకు ధన్యవాదాలు తెలిపారు.

Dailyhunt Survey Reveals 50 Percent Citizens Want Narendra Modi Second Term

నీల్సన్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన డేటా అనలిటిక్స్ కంపెనీ. ఇది కచ్చితత్వమైన ఫలితాలను వెల్లడిస్తుంది. ఈ సర్వేతో జత కట్టడం చాలా ఆనందంగా ఉంది. సర్వేలో ఓటర్ల నుంచి సమాచారం సేకరించాక వాటిని స్టడీ చేసి, విశ్లేషించి అంతా శాస్త్రీయంగా చేసి ఒక అంచనాకు వచ్చినట్లు చెప్పారు నీల్సన్-దక్షిణాసియా అధ్యక్షుడు ప్రసున్ బసు చెప్పారు.

మరిన్ని survey వార్తలుView All

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
More than 50 percent of the people in India are looking towards Prime Minister Modi's leadership for the second term revealed daily hunt survey. The survey done along with nielson india with the name "Trust of the nation" says that more than 50 lakh respondents put forth their wish and supported Modi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more