బీజేపీ మానవత్వాన్ని మరిచింది :దళిత పిల్లల ఘటనపై రాహుల్ స్పందన

మహారాష్ట్ర: ముగ్గురు దళిత పిల్లలను వివస్త్రలుగా చేసి గ్రామంలో ఊరేగించిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. జూన్ 10న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జలగావ్ జిల్లా వాకాడి గ్రామంలోని ఓ బావిలో గత ఆదివారం ఈ దళిత పిల్లలు స్నానం చేశారు. ఇది తెలుసుకున్న గ్రామంలోని అగ్రకులం వారు పిల్లలను బయటకు తీసుకొచ్చారు. పిల్లలను దూషించి వారి బట్టలను విప్పించి గ్రామంలో ఊరేగించారు. ఈ దృశ్యాలు సెల్ ఫోన్‌లో రికార్డు చేశారు. పిల్లల నడుము చుట్టూ ఆకులు కట్టి వారిని ఓ వ్యక్తి కర్ర, బెల్టుతో కొడుతున్నట్లుగా వీడియోలో కనిపించింది.

వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో పలువురు దళిత రాజకీయనాయకులు, నేతలు స్పందించారు. ఘటనను ఖండించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి వారిపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని దళిత నేత జిగ్నేష్ మెవానీ డిమాండ్ చేశారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సామాజికన్యాయశాఖ మంత్రి రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు.

Dalit boys paraded naked in a village in Maharashtra

ఘటనపై స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తన ట్విటర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ మహారాష్ట్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ హయాంలో జరుగుతున్న అరాచకాలపై గొంతెత్తి ప్రశ్నించకుంటే చరిత్ర మనలను ఎప్పటికీ క్షమించదని రాహుల్ ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం మానవత్వాన్ని చంపేసిందని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+