ఘోరం: దళితుడితో 15 మంది పోలీసు అధికారుల బూట్లు నాకించారు

Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: పోలీసు అధికారులపై ఓ దళితుడు తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తన చేత 15 మంది పోలీసు అధికారుల బూట్లు నాకించారని అతను ఆరోపించాడు. తన కులం చెప్పగానే తన చేత అహ్మదాబాద్‌లోని ఓ పోలీసు స్టేషన్‌లో ఆ పని చేయించినట్లు ఆరోపించాడు.

డిసెంబర్ 28వ తేదీ రాత్రి పోలీసు కానిస్టేబుల్ వ్యవహారంలో స్థానికంగా చోటు చేసుకున్న సంఘటనపై హర్షద్ యాదవ్ అనే 38 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏ విధమైన రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించకముందే వినోద్‌భాయ్ బాబూభాయ్ అనే కానిస్టేబుల్ అతనిపై దాడి చేశాడని, దానివల్ అతని వేలికి గాయమైందని, అతని కుటుంబ సభ్యులను దూషించాడని అమరవాది పోలీసు స్టేషన్ అధికారులు చెప్పారు.

 Dalit Man Alleges He Was Made To Lick Shoes Of 15 Police Officers In Gujarat

జాదవ్‌ను అదే రాత్రి పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్లారని, విధులు నిర్వహిస్తున్న ప్రభుత్యోద్యోగిని అడ్డుకున్నాడనే ఆరోపణపై అదుపులోకి తీసుకుని లాకప్‌లో పెట్టారని అంటున్నారు. కొద్ది మంది పోలీసు అధికారులు అతని కులం గురించి అడిగారని, దళితుడనని చెప్పగానే బాబూ భాయ్ పాదాలను తాకి, క్షమాపణలు కోరాలని అడిగారని సమాచారం.

టెలివిజన్లు మరమ్మత్తు చేసే జాదవ్ వారు చెప్పినట్లు చేశాడని అంటుననారు. ఆ తర్వాత 15 మంది పోలీసు అధికారుల బూట్లను బలవంతంగా నాకించారని ఆరోపిస్తున్నాడు. డిసెంబర్ 29వ తేదీన అతనికి బెయిల్ వచ్చింది. కానిస్టేబుల్‌పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Dalit man has alleged he was made to lick shoes of at least 15 police officials at a police station in Ahmedabad after he told them about his caste.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి