అసలేం జరిగింది?: గుజరాత్‌లో దళితుల రగడ, హెడ్ కానిస్టేబుల్ మృతి
రాజ్‌కోట్: గుజరాత్ రాష్ట్రంలో దళితుల ఆందోళన ఉధృతమైంది. గిర్-సోమనాథ్ జిల్లాలోని ఉనాలో చనిపోయిన ఆవు చర్మం వొలిచారంటూ దళితులపై జరిగిన దాడి ఘటన మొత్తం గుజరాత్‌లో మొత్తం మంటలు రేపుతోంది. ఈ దాడిలో దెబ్బలు తిన్న ఏడుగురు యవకులు ఆత్మహత్యాయత్నం చేయడంతో వారికి మద్దతుగా దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాయి.
ఇందులో భాగంగా గుజరాత్ దళిత ఆందోళన మంగళవారం అహ్మదాబాద్ సహా పలు ఇతర ప్రాంతాలకు విస్తరించింది. మంగళవారం అమ్రేలి పట్టణంలో జరిగిన ఘర్షణల్లో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఘర్షణల్లో భాగంగా రాళ్ల దెబ్బలకు గాయపడ్డ ఓ కానిస్టేబుల్ పంకజ్ అమ్రేలి రాజ్‌కోట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

ఈ హింసాత్మక ఘటనలో పదిమంది పోలీసులతో పాటు ఆందోళనకారులు కూడా గాయపడ్డారు. మరోవైపు రాజ్‌కోట్ జిల్లాలోని గోందల్, జాంకండ్‌దోర్నా గ్రామాల్లో ఏడుగురు యువకులు సోమవారం విషం తాగి ఆత్మాహుతికి యత్నించారు. దీంతో గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి.
అల్లర్లు గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌కు పాకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున దళిత యువకులను అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో గల జునాగఢ్, జాంనగర్, రాజ్‌కోట్, అమ్రేలి జిల్లాలలో మంగళవారం పలు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.
సౌరాష్ట్ర ప్రాంతంలోని అమ్రేలి పట్టణ రహదారులపై చచ్చిన గోవులను పడేసి దళితులు నిరసన తెలిపారు. వాటిని తీసివేయడానికి పోలీసులు ప్రయత్నించగా అడ్డుకున్నారు. ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. అంతక ముందు ఆందోళనకారులు అనేకచోట్ల బస్సులపై రాళ్లదాడి జరిపారు.
అసలేం జరిగింది?:
గత వారం రాజ్‌కోట్ జిల్లా యునా, జునాగఢ్ జిల్లా బాత్వా గ్రామాలకు చెందిన ఏడుగురు దళితులపై గో పర్యవేక్షణా కార్యకర్తలు దాడిచేశారు. గోవులను చంపి, చర్మం వొలుస్తున్నారంటూ వాళ్లని తాళ్లతో కట్టేశారు. తాము చచ్చిన గోవుల చర్మం తీస్తున్నామని చెప్పినా వినిపించుకోకుండా కొట్టారు. దీంతో మనస్థాపం చెందిన ఏడుగురు యువకులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications