ఇంట్లో చొరబడి దళిత యువతిపై గ్యాంగ్‌రేప్: తుపాకీతో బెదిరించి ఘాతుకం, నిందితుల్లో గ్రామపెద్ద
లక్నో: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన హత్రాస్ ఘటన మరువకముందే అదే రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దళిత మహిళను తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారాని పాల్పడ్డారు కామాంధులు. వీరిలో ఒకరు గ్రామ పెద్ద కూడా ఉండటం గమనార్హం.
ఈ దారుణ ఘటన వారం రోజుల క్రితమే జరిగినప్పటికీ.. తమకు మాత్రం ఆదివారం జరిగినట్లు ఫిర్యాదు అందిందని కాన్పూర్ దేహత్ ఎస్పీ కేశవ్ కుమార్ చౌదరి తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

బాధితురాలి తల్లిదండ్రుల తెలిపిన వివరాల ప్రకారం.. తమ 22 ఏళ్ల కూతురు
ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తుపాకీతో బెదిరింపులకు గురిచేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ విషయాన్ని గురించి బయటికి చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బాధిరాలిని నిందితులు హెచ్చరించారు.
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులపై ఐపీసీ, షెడ్యూల్ క్యాస్ట్స్ అండ్ ట్రైమ్స్ యాక్ట్ 1989 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల గాలింపు కూడా మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరు గ్రామ మాజీ సర్పంచ్ ఉండటం గమనార్హం.












Click it and Unblock the Notifications