వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: దళిత యువకుడిపై ప్రతాపం, యూరిన్ తాగాలని పీఎస్‌లో హరాస్..

|
Google Oneindia TeluguNews

అణగారిన వర్గాలు అంటే సమాజంలో చిన్న చూపే.. ఇక పోలీసుల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బలమైన సామాజిక వర్గం వారు ఏదీ చెబితే అదే జరుగుతుంది. కర్ణాటక చిక్ మంగళూర్ జిల్లాలో అలాంటి ఘటన జరిగింది. ఓ యువకుడిపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు.

 Dalit youth alleges cops beat him up, made him lick urine inside ps

గోనిబీడు పోలీస్ స్టేషన్ పరిధిలో పునీత్ అనే యువకుడు ఉంటున్నాడు. అతను ఓ మహిళతో తరచుగా మాట్లాడుతున్నాడు అనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది పోలీసులు పీఎస్‌కు తీసుకొచ్చారు. నరకం అంటే ఏంటో అతనికి చూపించారు. కాళ్లు చేతులు కట్టేసి కొట్టారు. దాహం వేస్తుందని అడిగిన పాపానికి యూరిన్ పోశారు. నేలపై ఉన్న అదీ నాకాలని బెదిరించారు. అలా చేయకుంటే వదిలిపెట్టమని హెచ్చరించారు.

Recommended Video

New Coronavirus Found In Malaysia That Can Transfer From Dogs To Humans || Oneindia Telugu

తనను కులం పేరుతో కూడా దూషించారని చెప్పారు. ఈ నెల 10వ తేదీన ఈ ఘటన జరగగా.. అతను డీజీపీకి ఫిర్యాదు చేశాడు.ఘటనపై చిక్ మంగళూర్ డీఎస్పీ స్పందించారు. దర్యాప్తు జరుగుతుందని.. ఎస్సైని ట్రాన్స్ ఫర్ చేశామని వివరించారు. ఈ ఘటనపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. సదరు ఖాకీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

English summary
Dalit youth Punneth in Karnataka has alleged that he was made to drink urine during interrogation inside a police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X