గన్‌తో బెదిరించి డ్యాన్సర్‌పై నల్గురు గ్యాంగ్ రేప్
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో ఓ డ్యాన్సర్ మీద నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె ఎదురు తిరగకుండా గన్ తో బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డారు.
గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు నిందితులు ఓ ప్రముఖ ఆయుర్వేద మందుల కంపెనీకి చెందిన వారని పోలీసు అధికారులు తెలిపారు. ఆయుర్వేద మందుల కంపెనీ ఓ పార్టీని ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించింది.
ఈ ఆయుర్వేద మందుల కంపెనీ లక్నోకు 20 కిలో మీటర్ల దూరంలోని బాంథారాలో ని ప్రముఖ హోటల్ లో పార్టీని ఏర్పాటుచేసింది. ఈ పార్టీలో కంపెనీకి చెందిన సత్యవీర్ సింగ్, దేవ్ రాజ్ సింగ్, భూషణ్ భారతీ, పరేశ్ తోమర్ అనే నలుగురు మేనేజర్ స్థాయి ఉద్యోగులు ఉన్నారు.
వీరిలో సత్యవీర్ సింగ్ అనే వ్యక్తి అష్వక్ అనే వ్యక్తి ద్వారా పార్టీలో డ్యాన్స్ చెయ్యడానికి ఓ ట్రూప్ కావాలని కోరాడు. దీంతో ఆ ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తన బృందంతో వచ్చిన ఓ డ్యాన్సర్ (25) అర్దరాత్రి వరకు ఆడిపాడింది. ఈ డ్యాన్స్ చూస్తూ పార్టీకి వచ్చిన వారు బాగా మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేశారు.

ఆ నలుగురు మాత్రం పీకలదాక మద్యం సేవించి డ్యాన్సర్ లతో ఇష్టం వచ్చినట్లు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ప్రధాన డ్యాన్సర్ వారిని వారించింది.
సత్యవీర్ సింగ్ పేమెంట్ గురించి మాట్లాడాలని ఓ గదిలో ఆ డ్యాన్సర్ ను పిలుచుకుని వెళ్లాడు. అప్పటికే అక్కడ మరో ముగ్గురు నిందితులు ఉన్నారు.
గదిలోకి వెళ్లిన తరువాత డోర్ లాక్ చేశారు. తరువాత ఆమె తలకు గన్ గురి పెట్టి డ్యాన్సర్ మీద సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు నలుగురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. అరెస్టు అయిన నలుగురు లక్నోకు చెందిన వారే అని పోలీసు అధికారులు తెలిపారు.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications