రేప్: జీన్స్ విప్పేసి, డానిష్ మహిళ ప్యాంట్ వేసుకెళ్లాడు

మహిళ పైన ఎనిమిది మంది అత్యాచారానికి పాల్పడ్డట్లుగా పోలీసులు గుర్తించారు. వారిలో ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
రాజకీయ దుమారం
డెన్మార్క్ మహిళపై జరిగిన అత్యాచారం ఢిల్లీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ అత్యాచార ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) నేత కుమార్ విశ్వాస్ మాట్లాడుతూ.. ఢిల్లీ పోలీసులు ఢిల్లీ ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేయరన్నారు. దీనిపై ఎఎపి నేతలు పెద్దగా స్పందించలేదు. ఈ అత్యాచారంపై వారు స్పందించక పోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
బాధిత మహిళ ఢిల్లీ ఓటరు కానందునే ఎఎపి పట్టించుకోలేదని కాంగ్రెసు పార్టీ నేత సందీప్ దీక్షిత్ విమర్శించారు. సొంత పార్టీ నేత వినోద్ కుమార్ బిన్నీ కూడా పార్టీ తీరును తప్పు పట్టారు. డెన్మార్క్ మహిళ అత్యాచారంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి ఆగ్రహం
అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి స్పందించారు. ఇలాంటి ఘటనలను ప్రజలు సహించరన్నారు. పోలీసులు సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. పని చేయని అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
కాగా, డెన్మార్క్ మహిళపై ఎనిమిది మంది వ్యక్తులు మూడు గంటల పాటు అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం ఈ దారుణం జరిగింది. భారత పర్యటనను ముగించుకోవడానికి సిద్ధపడిన ఆమె మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తాను బస చేసిన పహర్‌గంజ్ హోటల్‌కు తిరిగి వస్తూ దారి తప్పింది. ఆమె న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలోని స్టేట్ ఎంట్రీ రోడ్డులో గల రైల్వే ఆఫీసర్స్ క్లబ్‌కు చేరుకుంది.
అక్కడ ఆమెను చిన్న పాటి తోటలోకి ఆమె తోసుకెళ్లారు. కత్తితో బెదిరించి దుండగులు ఆమెను దోపిడీ చేశారు. దోపిడీ చేసి వదలకుండా ఆమెపై అత్యాచారం చేశారు ఎనిమిది మందిలో ఇద్దరు రెండేసి సార్లు తనను రేప్ చేశారని బాధితురాలు చెప్పింది. ఎట్టకేలకు ఆమె సాయంత్రం ఏడున్నర గంటలకు హోటల్‌కు చేరుకోగలిగింది. జరిగిన సంఘటనను హోటల్ మేనేజర్‌కు చెప్పింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్‌కు చెందిన మహేందర్ గంజాకు పోలీసులు గుర్తించారు. అతను గతంలో రెండు హత్య కేసుల్లో నిందితుడని తెలుస్తోంది. మరో నిందితుడిని రాజాగా గుర్తించారు. అతని నుంచి బాధితురాలికి చెందిన వేయి రూపాయల నగదును, కళ్లద్దాల కేస్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరో నలుగురిని పట్టుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications