వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదీ లెక్క..? తప్పుడు ఇన్ వాయిస్, మధ్య వర్తికి రూ.65 కోట్లు.. రాఫెల్ స్కాంపై మీడియా పార్ట్

|
Google Oneindia TeluguNews

రాఫెల్ జెట్ల కుంభకోణం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఫ్రెంచ్‌కు చెందిన మీడియాపార్ట్ పోర్టల్ మరో సంచలన విషయం తెలియజేసింది. రాఫెల్ జెట్లను భారతదేశం కొనుగోలు చేసే సమయంలో దాసల్ట్ ఏవియేషన్ సాయం చేసిందని.. ఇందుకు నగదు కూడా తీసుకుందనే విషయం తెలియజేసింది. తప్పుడు ఇన్ వాయిస్ అందజేశారని వివరించింది.

దీంతో 7.4 మిలియన్ యూరోలు.. అంటే రూ.65 కోట్లు మధ్యవర్తి సుశెన్ గుప్తాకు ముట్టాయని వెల్లడించింది. ఆగస్టా వెస్ట్‌లాండ్ కేసుకు సంబంధించి ఇప్పటికే గుప్తాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2007 నుంచి 2012 మధ్య ఈ చెల్లింపులు జరిగాయని తెలిపింది. ఆ సమయంలో దేశంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే యూపీఏ ప్రభుత్వం చేసిన ఒప్పందాన్ని ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసి.. జెట్ల కొనుగోలు కోసం భారీగా నగదు పెంచింది.

Dassault Aviation used false invoices to bribe middleman for sale of Rafale jets

36 రాఫెల్ జెట్ల కోసం రూ.59 వేల కోట్లు అందజేస్తామని దాసల్ట్ ఏవియేషన్‌తో ఒప్పందం చేసుకుంది. యూపీఏ హయాంలోనే అవినీతి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసు విచారణలో సీబీఐ, ఈడీ కీలక వివరాలను వెల్లడించాయి. 2018 అక్టోబర్‌లో లంచం ఇవ్వజూపారాని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. ఆ సమయంలోనే మనీ ల్యాండరింగ్ జరిగిందని మీడియా పార్ట్ రిపోర్ట్ చేసింది.

Recommended Video

The Best Fries In The World – A National Dish From Belgium

రాఫెల్ జెట్ల స్కాం దేశాన్ని కుదిపేసింది. అదికార, విపక్షాల మధ్య మాటల యుద్దం జోరుగా సాగింది. 2019లో రాఫెల్ జెట్ల స్కాం గురించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే విచారణ అర్హం కాదని కోర్టు తోసిపుచ్చింది.

English summary
french portal mediapart on monday claimed in a new report that it has evidence of kickbacks being paid by french aircraft manufacturer dassault aviation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X