వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Daughter: కన్న తల్లికి విషం పెట్టి చంపిన కన్నింగ్ కూతురు, విదేశాల్లో భర్త, బాయ్ ఫ్రెండ్ కు రూ. 8 లక్షల !

|
Google Oneindia TeluguNews

కొచ్చి/ త్రిశూర్: మద్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులు సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురికి పెళ్లి చేశారు. అల్లుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. భర్త విదేశాల్లో ఉండటంతో కూతురు ఆమె తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నది. మూడు రోజుల క్రితం అల్లుడు విదేశాల నుంచి ఇంటికి వెళ్లాడు. తల్లి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతున్న మహిళ చనిపోయింది. మహిళ శరీరంలో అదిక మోతాదులో విషం ఉండటంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు విచారణ చేసిన పోలీసులు మహిళ పెద్ద కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు. కూతురి మొబైల్ ఫోన్ పరిశీలించిన పోలీసులు అందులోని సమాచారం తెలుసుకుని షాక్ అయ్యారు.

Leader: ఆంటీ మోజులో అధికార పార్టీ లీడర్, రెండో పెళ్లికి ?, రివాల్వర్ తో భార్య మీద కాల్పులు, క్లైమాక్స్ లో !Leader: ఆంటీ మోజులో అధికార పార్టీ లీడర్, రెండో పెళ్లికి ?, రివాల్వర్ తో భార్య మీద కాల్పులు, క్లైమాక్స్ లో !

ఇద్దరు కూతుర్లు

ఇద్దరు కూతుర్లు

కేరళలోని త్రిశూర్ లోని కిలికులం ప్రాంతంలో చంద్రన్, రుక్మిణి దంపతులు నివాసం ఉంటున్నారు. మద్యతరగతి కుటుంబానికి చెందిన చంద్రన్, రుక్మిణి దంపతులు సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. రుక్మిణి, చంద్రన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు ఇందులేఖకు కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు.

విదేశాల్లో భర్త...... తల్లిదండ్రుల ఇంట్లో భార్య

విదేశాల్లో భర్త...... తల్లిదండ్రుల ఇంట్లో భార్య

ఇందులేఖ భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. భర్త విదేశాల్లో ఉండటంతో ఒంటరిగా ఎందుకు ఉంటావని, మాతోనే ఉండాలని చంద్రన్, రుక్మిణి దంపతులు వారి పెద్ద కూతురు ఇందులేఖకు చెప్పారు. విదేశాల్లో ఉన్న భర్త ప్రతిరోజు ఇందులేఖకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు.

 ఆసుపత్రిలో చనిపోయిన తల్లి

ఆసుపత్రిలో చనిపోయిన తల్లి

ఇటీవల రుక్మిణి, చంద్రన్ దంపతుల అల్లుడు విదేశాల నుంచి ఇంటికి వెళ్లాడు. ఈనెల 17వ తేదీన రుక్మిణి ఒక్కసారిగా అనారోగ్యానికి గురై త్రిశూర్ లోని ఆసుపత్రిలో చేరింది. తన తల్లి రుక్మిణి కొంతకాలంగా కామర్ల వ్యాధితో బాధపడుతోందని ఆమె పెద్ద కూతురు ఇందులేఖ డాక్టర్లకు చెప్పింది. చికిత్స పొందుతున్న రుక్మిణి రెండు రోజుల తరువాత చనిపోయింది.

పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

రుక్మిణి శరీరంలో అదిక మోతాదులో విషం ఉండటంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నివేదికలో కూడా రుక్మిణి విషం తాగి చనిపోయిందని వెలుగు చూసింది. కేసు విచారణ చేసిన పోలీసులు రుక్మిణి పెద్ద కుమార్తె ఇందులేఖను అదుపులోకి తీసుకున్నారు. ఇందులేఖ మొబైల్ ఫోన్ పరిశీలించిన కేరళ పోలీసులు అందులోని సమాచారం తెలుసుకుని హడలిపోయారు.

హత్య చేసి తప్పించుకోవడం ఎలా ?

హత్య చేసి తప్పించుకోవడం ఎలా ?

ఇందులేఖ కొంతకాలంగా ఆమె మొబైల్ ఫోన్ లో హత్య చెయ్యడం ఎలా, పోలీసుల నుంచి తప్పించుకోవడం ఎలా ?, ఎవ్వరికి అనుమానం రాకుండా హత్య చెయ్యడం ఎలా ? అని గూగుల్ లో తెగవెతికేసిందని పోలీసులు గుర్తించారు. గూగుల్ నువ్వు ఎందుక ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించావు ? అని పోలీసులు ప్రశ్నిస్తే అందుకు ఇందులేఖ ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో పోలీసులకు ఇంకా అనుమానం ఎక్కువ అయ్యింది.

నగలు కుదవ పెట్టి డబ్బులు బాయ్ ఫ్రెండ్ కు ఇచ్చి ?

నగలు కుదవ పెట్టి డబ్బులు బాయ్ ఫ్రెండ్ కు ఇచ్చి ?

ఇందులేఖను మరింత విచారణ చేశారు. భర్త విదేశాల్లో ఉండటంతో తెలిసిన వ్యక్తికి డబ్బు సహాయం చెయ్యడానికి ఇందులేఖ ఏకంగా రూ. 8 లక్షల విలువైన బంగారు నగలు కుదవ పెట్టిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. బంగారు నగలు కుదవపెట్టి బాయ్ ఫ్రెండ్ కు ఇచ్చానని భర్తకు తెలిస్తే తన సంసారం నాశనం అవుతుందని, నా భర్త నన్ను వదిలేస్తాడని ఇందులేఖ భయపడింది.

మేము చనిపోయిన తరువాత ఆస్తి నీ పేరుతో వస్తుంది

మేము చనిపోయిన తరువాత ఆస్తి నీ పేరుతో వస్తుంది

తండ్రి చంద్రన్ పేరుతో ఉన్న ఆస్తి తన పేరు మీద రాసివ్వాలని ఇందులేఖ తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేసిందని, మేము చనిపోయిన తరువాత ఆస్తి నీపేరుకు వస్తుందని రుక్మి ఆమె కూతురు ఇందులేఖకు చెప్పిందని తెలిసింది. తల్లిదండ్రులు చనిపోతే ఆస్తి తన పేరుతో వస్తుందని అనుకున్న ఇందులేఖ తల్లిదండ్రులను హత్య చెయ్యాలని డిసైడ్ అయ్యింది.

 కూతురి స్కెచ్....... తండ్రి జస్ట్ మిస్

కూతురి స్కెచ్....... తండ్రి జస్ట్ మిస్

గూగుల్ లో వెతికిన సమాచారంతో ఈనెల 17వ తేదీన టీలో విషం కలిపిన ఇందులేఖ ఆ టీ తల్లి రుక్మిణికి ఇవ్వడంతో ఆమె తాగేసింది. అయితే కూతురు ఇందులేఖ ఇచ్చిన టీ తాగకపోవడంతో తండ్రి చంద్రన్ బతికిపోయాడని పోలీసులు అన్నారు. తండ్రి ఆస్తి కోసం కన్న తల్లి రుక్మిణికి విషం పెట్టి హత్య చేసిన ఇందులేఖను అరెస్టు చెయ్యడం కేరళలో కలకలం రేపింది.

English summary
Daughter: Kerala police arrested a woman who allegedly killed her Mother with poison as she wants to get hold of her father's property in Thrissur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X