Daughter: అధికార పార్టీ లీడర్, తండ్రి హత్యకు కూతురు డీల్, బాయ్ ఫ్రెండ్ ఎంట్రీ, రోడ్డులో వెంటాడి లేపేశాడు !

చెన్నై/ కన్యాకుమారి: అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు సమాజంలో వైట్ కాలర్ ఎగరేసి తిరుగుతున్నాడు. ఇంతకాలం ప్రతిపక్షంలో ఉన్న నాయకుడి గురించి స్థానికులు పెద్దగా పట్టించుకోకపోయినా ఇప్పుడు మాత్రం ఆయనకు మంచి మర్యాద ఇస్తున్నారు. ఎవరైనా ఇబ్బందులు పడుతున్నామని వెలితే ఆ లీడర్ పంచాయితీలు, రాజీలు చేస్తున్నాడు. ఎప్పటిలాగే ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ పొలిటికల్ లీడర్ పని ముగించుకుని ఇంటికి బయలుదేరారు. ఇంటి సమీపంలోనే అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకుడిని వెంటాడి అతి దారుణంగా నరికి చంపడం కలకలం రేపింది. రాజకీయ విభేదాలు, పాతకక్షల కారణంగా అధికార పార్టీ నాయకుడు హత్యకు గురైనాడని మొదట అందరూ అనుమానం వ్యక్తం చేశారు. అయితే పోలిటికల్ లీడర్ ను అతని కూతురే స్నేహితుడితో హత్య చేయించిందని వెలుగు చూడటం కలకలం రేపింది.

పొలిటికల్ లీడర్

పొలిటికల్ లీడర్

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కులాచల్ సమీపంలోని సెంబోన్ విలై ప్రాంతంలో కుమార్ శంకర్ అలియాస్ శంకర్ నివాసం ఉంటున్నాడు .ఇతని భార్య, కాలేజ్ లో చదువుతున్న కూతురు ఉన్నారు. కన్యాకుమారి జిల్లా డీఎంకే పార్టీ కార్యదర్శిగా పని చేస్తున్న కుమార్ శంకర్ స్థానికంగా మంచి పలుకుబడి పెట్టుకున్నాడు.

అధికార పార్టీ నాయకుడు

అధికార పార్టీ నాయకుడు


గతంలో తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉండటం, తరువాత డీఎంకే పార్టీ అధికారంలోకి రావడంతో సీఎంగా స్టాలిన్ పని చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు కుమార్ శంకర్ సమాజంలో వైట్ కాలర్ ఎగరేసి తిరుగుతున్నాడు. ఇంతకాలం ప్రతిపక్షంలో ఉన్న కుమార్ శంకర్ గురించి స్థానికులు పెద్దగా పట్టించుకోకపోయినా ఇప్పుడు మాత్రం కుమార్ శంకర్ కు మంచి మర్యాద ఇస్తున్నారు. ఎవరైనా ఇబ్బందులు పడుతున్నామని వెలితే పొలిటికల్ లీడర్ కుమార్ శంకర్ పంచాయితీలు, రాజీలు చేస్తున్నాడు.

 పొలిటికల్ లీడర్ దారుణ హత్య

పొలిటికల్ లీడర్ దారుణ హత్య

ఎప్పటిలాగే ఇంటి నుంచి బయటకు వెళ్లిన పొలిటికల్ లీడర్ కుమార్ శంకర్ రాత్రి పని ముగించుకుని ఇంటికి బయలుదేరారు. ఇంటి సమీపంలోనే అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు కుమార్ శంకర్ ను వెంటాడి అతి దారుణంగా నరికి చంపడం కలకలం రేపింది. కుమార్ శంకర్ తప్పించుకోవడానికి ప్రయత్నించినా ప్రత్యర్థులు మాత్రం అతన్ని వదల్లేదని ప్రత్యక్షసాక్షలు అంటున్నారు.

పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు

పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు


రాజకీయ విభేదాలు, పాతకక్షల కారణంగా అధికార పార్టీ నాయకుడు కుమార్ శంకర్ హత్యకు గురైనాడని మొదట అందరూ అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు వివిద కోణాల్లో విచారణ చేశారు. పోలీసుల విచారణలో కుమార్ శంకర్ హత్యకు గురైనా ఏమాత్రం బాధలేకుండా ఆమె కూతురు దీపావతి కూల్ గా ఉండటంతో పోలీసులకు ఆమె మీద అనుమానం వచ్చింది.

మానాన్న మాకు టార్చర్ పెడుతున్నాడు

మానాన్న మాకు టార్చర్ పెడుతున్నాడు

పోలీసులు కుమార్ శంకర్ కూతురు దీపావతిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. పోలీసుల విచారణలో దీపావతి షాకింగ్ విషయాలు బయటకు చెప్పింది. తన తండ్రి కుమార్ శంకర్ రోజూ పీకలదాక మద్యం సేవించి ఇంటికి వచ్చి తన తల్లిని, తనను టార్చర్ పెడుతున్నాడని దీపావతి పోలీసులకు చెప్పింది.

తండ్రి హత్యకు కూతురు డీల్

తండ్రి హత్యకు కూతురు డీల్


తన ఇంటి సమీపంలోని నివాసం ఉంటున్న కోపు (18) అనే యువకుడి సహాయంతో శ్రీముకుంద్ అనే యువకుడిని తాను పరిచయం చేసుకున్నానని దీపావతి పోలీసులకు చెప్పింది. తన తండ్రి కుమార్ శంకర్ ను హత్య చెయ్యడానికి శ్రీముకుందన్ రూ. 60 వేలు అడిగానని, అడ్వాన్స్ గా రూ. 10 వేలు ఇచ్చానని దీపావతి పోలీసులకు చెప్పింది.

తండ్రి హత్య కేసులో కూతురు అరెస్టు

తండ్రి హత్య కేసులో కూతురు అరెస్టు


దీపావతి, కోవు ఇచ్చిన సమాచారంతో పక్కాప్లాన్ ప్రకారం శ్రీముకుందన్ డీఎంకే లీడర్ కుమార్ శంకర్ ను దారుణంగా చంపేశాడని పోలీసులు అధికారులు అన్నారు. అధికార పార్టీ నాయకుడు కుమార్ శంకర్ హత్య కేసులో అతని కూతురు దీపావతి, ఆమె స్నేహితులు శ్రీముకుందన్, కోవును అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కన్యాకుమారి జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+