Bengaluru: కుక్క కోసం ఎంతపని జరిగింది ?, కూతుర్ని చంపేసి తల్లి ఆత్మహత్య, అసలు మ్యాటర్ తెలిసి ?!

బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులకు ఓ కుమార్తె ఉంది. భర్త అతని తల్లిదండ్రులు, భార్య, కూతురితో కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల కూతురు అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ అమ్మాయి తల్లిదండ్రులకు ఓ విషయం చెప్పాడు. ఇదే విషయంలో ఇంట్లో గొవలు మొదలైనాయి. రానురాను గొడవలు ఎక్కువ అయ్యాయి. నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మహిళ ఆమె మైనర్ కూతురిని హత్య చేసి ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

బెంగళూరులో దంపతులు

బెంగళూరులో దంపతులు

బెంగళూరు నగరంలోని నాగవర సమీపంలోని హెచ్ బీఆర్ లేఔట్, ఒకటవ స్టేజ్ లో శ్రీనివాస్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 16 ఏళ్ల క్రితం శ్రీనివాస దివ్యా (38) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న శ్రీనివాస్, దివ్యా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేస్తున్నారు. శ్రీనివాస్, దివ్యా దంపతులకు హృద్యా (14) అనే కుమార్తె ఉంది.

కూతురు అనారోగ్యంతో ?

కూతురు అనారోగ్యంతో ?


శ్రీనివాస్ అతని తల్లిదండ్రులు వసంతా, జానర్దన్, భార్య దివ్యా, కూతురు హృద్యా తో కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల కూతురు హృద్యా అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు ఆసుపత్రిలో చికిత్స చేయించడానికి శ్రీనివాస్, దివ్యా దంపతుల పిలుచుకుని వెళ్లారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ అమ్మాయి హృద్యా అనారోగ్యానికి అసలు కారణం ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు.

కుక్క కారణంగా అనారోగ్యం

కుక్క కారణంగా అనారోగ్యం

మీ ఇంటిలొ పెంచుకుంటున్న కుక్క కారణంగా హృద్యాకు ఇన్ఫెక్షన్ అయ్యిందని, వీలైనంత త్వరగా ఆ కుక్కను బయటకు పంపించాలని డాక్టర్ చెప్పాడు. ఇదే విషయం దివ్యా ఆమె అత్తమామలకు చెప్పింది. అయితే కుక్కను బయటకు పంపించడానికి దివ్యా భర్త శ్రీనివాస్ తో పాటు ఆమె అత్తమామలు వసంత, జనార్దన్ అంగీకరించలేదు.

నువ్వు చచ్చినా పర్వాలేదు, కుక్కను మాత్రం వదలం

నువ్వు చచ్చినా పర్వాలేదు, కుక్కను మాత్రం వదలం


ఇదే విషయంలో దివ్యా కొన్ని రోజుల పాటు అత్తమామలు, భర్త శ్రీనివాస్ తో గొడవపడుతూ వచ్చింది .ఇంటిలో పెంచుకుంటున్న కుక్క వలన రోగాలు రాలేదని, వీధి కుక్కల వలన అమ్మాయికి రోగం వచ్చిందని అత్తమామలు వసంత, జనార్దన్ వాదించారు. నువ్వు చస్తే చావు, మేము మాత్రం కుక్కను ఇంటి నుంచి బయటకు పంపించము అని అత్తమామలు తేల్చి చెప్పారు.

 కూతుర్ని చంపేసి ఆత్మహత్య

కూతుర్ని చంపేసి ఆత్మహత్య

ఇదే విషయంలో జీవితంపై విరక్తి పెంచుకున్న దివ్యా జరిగిన విషయం మొత్తం ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. తరువాత కూతురు హృద్యాకు ఉరి వేసి హత్య చేసిన దివ్యా ఆమె కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దివ్యా తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గోవిందపురం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+