వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దావూద్ ఇబ్రహీంకు కుచ్చుటోపీ పెట్టిన శిష్యుడు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కుచ్చుటోపీ పెట్టారు. దావూద్ ఇబ్రహీంకు కుచ్చుటోపీ పెట్టింది ఎవరో కాదు, అతని నమ్మకమైన అనుచరుడు ఖలీక్ అహమ్మద్.

రూ. 40 కోట్లు దావూద్ కు ఎగనామం పెట్టి తప్పించుకుతిరుగుతున్నాడు. ఈ విషయంలో సీనియస్ అయిన దావూద్ తన అనుచరులతో ఖలీక్ అహమ్మద్ కోసం గాలిస్తున్నాడని భారత నిఘా వర్గాలు పసిగట్టాయి.

దావూద్ ఇబ్రహీం భారత్ లో డ్రగ్స్, ఆయుధాలు, వజ్రాల వ్యాపారంతో పాటు నల్లధనానికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నాడు. ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి నల్లధనాన్ని దుబాయ్, కెనడా, పనామా, పాకిస్థాన్ లకు హవాలా ద్వారా తరలిస్తున్నాడు.

కొద్ది సంవత్సరాల తరువాత ఆ నల్లధనాన్ని మామూలుగా చలామణి చెయ్యడానికి సహకరిస్తున్నాడు. ఇందులో భాగంగా ఖలీక్ అహమ్మద్ ఢిల్లీలోని ఓ వ్యక్తి నుంచి రూ. 45 కోట్ల నల్లధనాన్ని దావూద్ తరుపన తీసుకున్నాడు.

ఆ డబ్బును హవాలా ద్వారా విదేశాలకు తరలించాల్సి ఉంది. అడబ్బు తీసుకున్న ఖలీక్ అహమ్మద్ సర్వీస్ చార్జ్ కింద దావూద్ ఇబ్రహీంకు రూ. 5 కోట్లు పంపించాడు. మిగిలిన రూ. 40 కోట్లు తీసుకుని విదేశాలకు పరారైనాడు.

భారత నీఘా వర్గాలు కొన్ని అంతర్జాతీయ ఫోన్ నెంబర్లు ట్యాప్ చెయ్యగా ఈ వివరాలు బయటపడ్డాయి. దావూద్ ఇబ్రహీం అనుచరుడు జబీర్ మోతి పాకిస్థాన్ లో ఉన్నాడు. జబీర్ ఫోన్ చేసి ఖలీక్ అహమ్మద్ తో ఈ డీల్ కు సంబంధించి మాట్లాడాడని అధికారులు అంటున్నారు.

Dawood Ibrahim henchman steals Rs 40 crore form Don

దావూద్ ఇబ్రహీం పనులు చక్కదిద్దడానికి ఖలీద్ అహమ్మద్ నిత్యం భారత్ - షార్ఝాల మధ్య తిరుగుతున్నాడని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఖలీక్ అహమ్మద్ రూ. 40 కోట్లతో ఉడాయించడంతో దావూద్ ఇబ్రహీం సీరియస్ గా ఉన్నారని ఓ ఫోన్ కాల్ సారాంశం అని అధికారులు చెప్పారు.

ఖలీక్ అహమ్మద్ ను పట్టుకోవడానికి 2015 నవంబర్ 26వ తేదిన దావూద్ ఇబ్రహీం ఇద్దరు అనుచరులు ఢిల్లీ నుంచి కెనడా వెళ్లారని భారత నిఘా వర్గాలు తెలిపాయి. అయితే ఖలీక్ అహమ్మద్ మణిపూర్ లో తలదాచుకున్నాడని భారత్ నిఘా వర్గాల దగ్గర సమాచారం ఉంది.

ఖలీక్ అహమ్మద్ మోసగించిన డబ్బులో సగం పనామా బ్యాంకులో డిపాజిట్ చేశాడని, మిగిలిన సగం డబ్బు దావూద్ ఇబ్రహీంకు విదేశాల్లో ఉన్న వ్యాపారాల్లో అతని పేరు మీద పెట్టుబడులు పెట్టాడని భారత నిఘా వర్గాలు అంటున్నాయి.

English summary
Indian agencies learnt about the embezzlement through tapped conversations between Jabir Moti, Dawood's henchman in Pakistan, and Khalique Ahmad, who used to shuttle between India and Sharja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X