భారత క్రికెటర్లకు దావూద్ కార్ల ఆఫర్: వెంగ్ సర్కార్

మ్యాచ్ జరిగే ముందు దావూద్ ఇబ్రహీం తమ డ్రెస్సింగ్ రూంను సందర్శించాడని, తనను తాను ఓ వ్యాపారవేత్తగా దావూద్ పరిచయం చేసుకున్నాడని దిలీప్ వెంగ్ సర్కార్ తెలిపారు. షార్జాలో జరిగిన ఆస్ట్రేలియా-ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో ఒక వేళ భారత జట్టు పాకిస్థాన్ జట్టును ఓడిస్తే తమ జట్టులోని ప్రతీ ఒక్కరికి టయోటా కారోల కారును బహుమతిగా ఇస్తానని దావూద్ ప్రకటించినట్లు సర్కార్ చెప్పారు.
ఆ సమయంలోనే డ్రెస్సింగ్ రూంలోకి వచ్చిన భారత ఆటగాడు కపిల్ దేవ్ అతనెవరని అడిగినట్లు తెలిపారు. అతనెందుకు రూంలోకి వచ్చాడని తమను ప్రశ్నించినట్లు వెంగ్ సర్కార్ తెలిపారు. దావూద్ ఇబ్రహీంను రూంలో నుంచి బయటికి వెళ్లాలని కపిల్ కోరినట్లు సర్కార్ చెప్పారు. అప్పుడు అతను ఎవరో తెలియదని వెంగ్‌సర్కార్ చెప్పాడు.
కపిల్ స్పందనతో ఆగ్రహం వ్యక్తం చేసిన దావూద్ ఆగ్రహంగా రూంలో నుంచి బయటికి వెళ్లాడని సర్కార్ తెలిపాడు. అంతేగాక తన కారు బహుమతిని కూడా దావూద్ రద్దు చేసుకున్నట్లు చెప్పాడు. ఆ సమయంలో కపిల్ దేవ్‌కి తను మాట్లాడిన వ్యక్తి దావూద్ అని తెలియదని సర్కార్ తెలిపారు. అయితే అతను రూంలోకి రావడాన్ని అనుమతించలేదని, అతని బహుమతిని కపిల్ నిరాకరించాడని అన్నారు. కాగా ఆ ఫైనల్ మ్యాచులో ఒక వికెట్ తేడాతో పాకిస్థాన్ విజయం సాధించింది.












Click it and Unblock the Notifications