కొత్త ‘కాగ్’గా జీసీ ముర్ము నియామకం: ఎల్జీ పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే ఉత్తర్వులు
న్యూఢిల్లీ: భారత నూతన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా గిరీష్ చంద్ర ముర్ము నియమితులయ్యారు. జమ్మూకాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే ఈ నియామకం జరగడం గమనార్హం. బుధవారం రాత్రే ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే.
ముర్ము రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెపడం.. ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ కొత్త లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా మనోజ్ సిన్హా నియమితులు కావడం చకచకా జరిగిపోయాయి. తాజాగా, గురువారం జీసీ ముర్ముును కాగ్ చీఫ్‌గా నియమిస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా పేరుతో ఈ నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 క్లాజ్ 1 ప్రకారం సంక్రమించిన అధికారాలకు అనుగుణంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. కొత్త కాగ్ చీఫ్‌గా జీసీ ముర్మును నియమించారు.
Recommended Video
కాగా, ప్రస్తుతం కాగ్ చీఫ్ రాజీవ్ మెహరిషి పదవీ కాలం ఈవారంలోనే ముగియనుంది. కాగా, ఆగస్టు 8న ఆయన 65వ పడిలోకి అడుగుపెట్టనున్నారు. రాజీవ్ కాగ్ పదవి నుంచి తప్పుకున్న వెంటనే జీసీ ముర్ము ఆ బాధ్యతలను చేపట్టనున్నారు. కాగ్ రాజ్యాంగబద్దమైన పదవి కావడంతో ఈ స్థానం ఖాళీగా ఉండకూదు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications