బెంగళూరులో చెరువు మధ్యలో రోడ్డు వేసిన ఇంజనీర్లు, డీకేశీ దెబ్బతో !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో ప్రభావవంతమైన నాయకులు అపార్ట్ మెంట్ నిర్మించారు. అపార్ట్‌మెంట్ యజమానులకు సౌకర్యాలు కల్పించేందుకు హోసకరెహళ్లి చెరువును విభజించి మధ్యలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టును ప్లాన్ చేసి అమలు చేసిన అధికారులు, ఇంజనీర్లందరినీ సస్పెండ్ చేయాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్‌ను ఆదేశించారు.
ఈ చెరువు మధ్యలో రహదారిని నిర్మించాలనే ఆలోచన ఎవరు ఇచ్చారు? ప్లాన్ చేసింది ఎవరు? ఎవరు అమలు చేశారు? ఎందుకు ఇలా చేసారు? మీరు ఎవరికి సహాయం చేసారు? ఇందులో ఎవరెవరి హస్తం ఉంది అని సోమవవారం బెంగళూరులో జరిగిన బీబీఎంపీ అధికారుల సమావేశంలో డీసీఎం డీకే. శివకుమార్ అధికారులను ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పేందుకు అధికారులు తడబడ్డారు. వెంటనే హొసకెరెహళ్లి చెరువును విభజించి రోడ్డు వేసిన అధికారులను సస్పెండ్ చేయాలని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదేశాలు జారీ చేశారు.

ఈజీపురా ఫ్లై ఓవర్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఈజీపురా ఫ్లైఓవర్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను డీసీఎం డీకే శివకుమార్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి అవసరమైన పాలనాపరమైన నిర్ణయాలు వెంటనే తీసుకోవాలని తుషార్ గిరినాథ్‌ను డీసీఎం డీకే. శివకుమార్ ఆదేశించారు.
వచ్చే 20 ఏళ్లకు బెంగళూరు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని బీబీఎంపీ అధికారులకు డీకే శివకుమార్ సూచించారు. బెంగుళూరుకు సంబంధించి ఇప్పటి వరకు బీబీఎంపీ అధికారులు, గతంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎలాంటి పారదర్శిక ప్రణాళికలు రూపొందించలేదని డీకే శివకుమార్ విచారం వ్యక్తం చేశారు.

బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో హోర్డింగ్‌లు ఉన్నాయి. దీనికి ఎవరు అనుమతి ఇచ్చారు? ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధానం ఎలా ఉందని బీబీఎంపీ అధికారులను డీకే శివకుమార్ ప్రశ్నించారు. అన్ని చోట్లా ఒకే విధానం వర్తించేలా సాధారణ విధానాన్ని రూపొందించాలని బీబీఎంపీ అధికారులకు డీకే శివకుమార్ సూచించారు. గతంలో బీజేపీ నాయకులకు అనుకూలంగా పని చేసిన బీబీఎంపీ అధికారులు అందరికి డీకే శివకుమార్ దెబ్బతో తడిపోతా ఉంది.












Click it and Unblock the Notifications