మహిళతో ఏఏపీ విశ్వాస్ సంబంధం: హైడ్రామా, డీసీడబ్ల్యూ మెంబర్ రిజైన్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలోని ప్రకంపనలు ఢిల్లీ కమిషన్ ఫర్ వుమెన్ (డీసీడబ్ల్యూ)కు కూడా తాకింది. ఏఏపీ నేత కుమార్ విశ్వాస్‌కు నోటీసుల అంశంపై డీసీడబ్ల్యూ మెంబర్ ఒకరు తన పదవి నుండి తప్పుకున్నారు. కుమార్ విశ్వాస్‌కు నోటీసులు ఇస్తుండటం ద్వారా ఏఏపీ ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపిస్తూ సభ్యురాలైన జుహీఖాన్ తప్పుకున్నారు.
జూహిఖాన్... డీసీడబ్ల్యూ చీఫ్ బర్కా దత్‌తో కలిసి జాయింట్ ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. కుమార్ విశ్వాస్‌కు నోటీసులు జారీ చేయడం రాజకీయపరంగా జరిగిందని జూహిఖాన్ ఆరోపించారు. విశ్వాస్‌కు, ఆయన భార్యకు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

కాగా, ఏఏపీ నేత కుమార్ విశ్వాస్, ఆయన భార్యకు సోమవారం నాడు డీసీడబ్ల్యూ నోటీసులు జారీ చేసింది. మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఆయన హాజరు కాలేదు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు.
అనంతరం డీసీడబ్ల్యూ మరో నోటీసు జారీ చేసింది. బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలోగా కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. దీనిని బర్కా దత్ పక్కనే ఉన్న సభ్యురాలు జూహిఖాన్ తప్పుపట్టారు. కుమార్ విశ్వాస్‌ను టార్గెట్ చేసుకున్నారని ఆమె ఆరోపించారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications