కరోనా విశ్వరూపం... ఈ ఒక్క నెలలోనే 83వేల మరణాలు.. 21 రోజుల్లోనే 70 లక్షల కొత్త కేసులు
దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం వరకు వరుసగా 3లక్షల పైచిలుకు నమోదైన పాజిటివ్ కేసులు.. ఇప్పుడు 2లక్షల పైచిలుకు మాత్రమే నమోదవుతున్నాయి. అయితే గత 21 రోజుల్లో రికార్డు స్థాయిలో 70 లక్షల కొత్త కేసులు నమోదవడం గమనార్హం. గత నెలలో అత్యధికంగా 69.4 లక్షల కొత్త కరోనా కేసులు నమోదవగా... గడిచిన 21 రోజుల్లోనే అంతకుమించి కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా తగ్గలేదు. కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ఈ ఏడాది మే నెలలోనే ఎక్కువ మరణాలు సంభవించాయి. నిత్యం 4వేల పైచిలుకు మరణాలు నమోదవుతున్నాయి. ప్రస్తుత మే నెలలో ఇప్పటివరకూ 71.3లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ నమోదైన మొత్తం 2.62 కోట్ల పైచిలుకు కరోనా కేసుల్లో ఈ ఒక్క నెలలోనే 27శాతం కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్క నెలలోనే 83,135 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటివరకూ నమోదైన 3 లక్షల మరణాల్లో ఇది 28శాతం. గత ఏప్రిల్‌లో 48,768 మరణాలు మాత్రమే సంభవించాయి. ఈ లెక్కన మే నెల

ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,57,299 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,62,89,290కి చేరింది. గడిచిన 24 గంటల్లో మరో 4194 మంది కరోనాతో మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 3 లక్షలు దాటింది. మహారాష్ట్రలో అత్యధికంగా 1263 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 29,23,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా కేసుల్లో అత్యధికంగా తమిళనాడులో 36,184 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 32,218 కేసులు,కేరళలో 29,673 కేసులు,మహారాష్ట్రలో 29,644 కేసులు,ఆంధ్రప్రదేశ్‌లో 20,937 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో ఈ ఐదు రాష్ట్రాల్లో నమోదైన కేసులే 57.77శాతం కావడం గమనార్హం. ఇందులో ఒక్క తమిళనాడులోనే 14.06 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల నుంచే 30వేల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి.












Click it and Unblock the Notifications