కుంభమేళాలో ప్రాణాంతక మల బ్యాక్టీరియా.. స్నానం చేస్తే ఇక అంతే..!

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవుతున్నారు. మంగళవారం సాయంత్రానికి దాదాపు 55 కోట్ల మందికి పైగా భక్తులు గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమంలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ విషయాన్ని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ధ్రువీకరించింది.

నదిలో ప్రాణాంతక బ్యాక్టీరియా..

భక్తులు పవిత్ర స్నానం చేసే పలు ప్రాంతాలకు సంబంధించి కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. మహా కుంభమేళాలోని త్రివేణి సంగమంలో ప్రాణాంతక మల కోలిఫామ్ బ్యాక్టీరియాను గుర్తించినట్లు పేర్కొంది. ప్రమాదకర స్థాయిలో ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు తాజాగా ఓ నివేదికను అందజేసింది. మురుగునీటి కాలుష్యానికి సూచిక అయిన మల కోలిఫామ్ బ్యాక్టీరియా పరిమితి 100 మిల్లీలీటర్లకి 2500 యూనిట్లు ఉంటుందని కానీ ప్రయాగ్ రాజ్ ప్రాంతంలోని నదిలో ఎక్కువగా ఉందని పేర్కొంది.

Deadly Fecal Coliform Bacteria Detected at Triveni Sangam During Kumbh Mela Says CPCB

మల కోలిఫామ్ బ్యాక్టీరియా అంటే ఏమిటి?

మానవుడి నుంచి వెలువడిన మలంలో ఈ బ్యాక్టీరియా ఉంటుంది. నీటిలో మల విసర్జన చేసిన చోట బ్యాక్టీరియా ఉద్భవిస్తుంది. ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ ఈ బ్యాక్టీరియా స్థాయి ప్రమాదకర స్థాయికి చేరినట్లు సీపీసీబీ నివేదికలో పేర్కొంది.ఇవి తాగడానికి, ఈత కొట్టడానికి, స్నానం చేయడానికి సురక్షితంగా లేదని నివేదించింది. ఈ బ్యాక్టీరియా వల్ల అనేక అనారోగ్య కారణాలు వస్తాయి. వాంతులు, విరేచనాలు, కడుపు ఉబ్బరం.. లాంటి సమస్యలు వస్తాయని సీపీసీబీ పేర్కొంది. చర్మంపై దద్దుర్లు, శ్వాసకోశ వ్యాధులు కూడా వస్తాయని తెలిపింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో ఈ బ్యాక్టీరియా తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+