వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిడిపి, బిజెపి మధ్య ఒప్పందం:, పంచుకోవడానికి కాదని ముఫ్తీ

By Pratap
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న అనిశ్చితి ఎట్టకేలకు తొలగింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి), పీపుల్స్‌ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) కలిశాయి. దీంతో రాష్ట్రంలో సంకీర్ణప్రభుత్వం ఏర్పాటు కానుంది. జాతీయ కారణాల దృష్ట్యా బీజేపీతో పొత్తు తప్పలేదని, జమ్మూకాశ్మీర్ అభివృద్ధికోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీడీపీ అధినేత మహబూబా ముఫ్తీ తెలిపారు.

జమ్మూకాశ్మీర్‌లో పీడీపీ, బీజేపీ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై త్వరలో కనీస ఉమ్మడి ప్రణాళికను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీతో మహబూబా ముఫ్తీ భేటీ తర్వాత కనీస ఉమ్మడి ప్రణాళికపై నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు.

Deal sealed: BJP, PDP formally announce alliance in J&K

బీజేపీ-పీడీపీ పొత్తుపై పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ స్పందించారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ఆమె తెలిపారు. బీజేపీ-పీడీపీ పొత్తు అధికారాన్ని పంచుకోవడానికి కాదని రాష్ర్టాభివృద్దికేనని స్పష్టం చేశారు. ప్రజల హృదయాలను గెలుచుకోవడానికే పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో అవినీతిరహిత పాలనను అందిస్తామని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ర్టాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటకు ఆటంకం తీరినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

జాతీయ కారణాల దృష్ట్యానే బీజేపీతో కలిసి జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమైనట్టు పీడీపీ నేత మహబూబాముఫ్తీ వెల్లడించారు. ఈమేరకు మంగళవారంనాడు ముఫ్తీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై చర్చించేందుకు సమావేశమయ్యారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జమ్మూకాశ్మీర్‌లో గత కొన్నిరోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినందుకు సంతోషంగా ఉందని అన్నారు. పొత్తు అధికారం కోసం కాదని, ప్రజల హృదయాలను దోచుకునేందుకేనని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌ను క్షేత్రస్థాయిలో అభివృద్ధిని చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా మార్చి 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మొత్తం పూర్తి కాలం ఆరేళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. బిజెపిికి చెందిన నిర్మల్ సింగ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు కానుంది.

English summary
The Bharatiya Janata Party and the People's Democratic Party on Tuesday stated Jammu and Kashmir would soon have a government under their alliance, adding that their union was formulated keeping peace of the state in mind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X