వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్ చేసిన వారిని ఉరి తీయాలి: నిర్భయ తల్లి

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అత్యాచారానికి పాల్పడిన ప్రతి ఒక్కరిని ఉరి తీయాల్సిందేనని నిర్భయ తల్లి ఆశాదేవి అభిప్రాయపడ్డారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి ఏడేళ్ళ శిక్ష సరిపోదని ఆమె అభిప్రాయపడ్డారు.. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఉరి శిక్ష విధించాల్సిన అవసరం ఉందన్నారు.

మైనర్లపై అత్యాచారానికి పాల్పడితే ఉరి శిక్ష విధించాలని కేంద్రం కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.ఈ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాద్‌కోవింద్ ఆదివారం నాడు ఆమోదముద్ర పడింది. అయితే ఈ ఆర్డినెన్స్‌పై నిర్భయతల్లి ఆశాదేవి స్పందించారు.

Death for child rape: Good step, but every rapist should be hanged, says Nirbhayas mother

ఈ నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. దేవతల్లాగా పూజించాల్సిన మహిళలపై అత్యాచారాలు చేయడమే తప్పు. పిల్లలైనా, యువతులైనా తల్లిదండ్రులకు కడుపుకోతే. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అత్యాచారం చేయడానికి మించిన పాపం మరొకటి లేదన్నారు.

నిర్భయ చట్టం తెచ్చినప్పటికీ అత్యాచారాలు ఏమీ ఆగలేదు. మహిళలపై అత్యాచారాలు చేస్తే ఏడేళ్ల శిక్ష సరిపోదనేది నా అభిప్రాయం. చిన్నారు లు, యువతులు.. మహిళలు ఎవరిపై అయినా సరే అత్యాచారానికి పాల్పడితే వారందరినీ ఉరితీయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

English summary
Asha Devi, the mother of Nirbhaya who was gang-raped and murdered in December 2012, believes that death penalty for those who rape children under 12 years is a step in the right direction. But, she has demanded that every rapist should be given the same punishment. " It is a good step, but what about ones who are older? There is no more heinous crime than rape, there is no larger pain. Every rapist should be hanged,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X