ఐదేళ్ల చిన్నారిపై రేప్, ఆపై హత్య: మరణశిక్ష
సురి(పశ్చిమబెంగాల్): ఐదేళ్ల చిన్నారపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేసిన కేసులో ఓ దళిత యువకుడికి కోర్టు మరణశిక్ష విధించిదంి. పశ్చిమ బెంగాల్‌లో బిర్భుం జిల్లాలోని మోల్డంగ గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలికపై గిరిజన యువకుడు సుకల్ టుడు(20) పది నెలల క్రితం అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ కేసును విచారించిన సురి సెషన్స్ కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి కోర్టు మరణశిక్ష విధించింది. నిరుడు డిసెంబర్ 11వ తేదీన బాలిక అదృశ్యమైంది. తమ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు గాలింపు చేపట్టారు. అయినా ఫలితం కనిపించలేదు.

అయితే చివరిసారిగా బాలికను సుకుల్‌తో చూసినట్టు కొందరు చెప్పడంతో అతడిని పట్టుకుని గట్టిగా ప్రశ్నించారు. దీంతో బోరున ఏడ్చేస్తూ సుకుల్ తన నేరాన్ని అంగీకరించాడు. మూసి వేసిన రైసు మిల్లులో బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పాడు.
అతడిని తీసుకుని అక్కడికి వెళ్లిన గ్రామస్తులకు రక్తపు మడుగులో స్పృహ తప్పి పడి ఉన్న చిన్నారి కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత బాలిక మృతి చెందింది.












Click it and Unblock the Notifications