బస్సు హైజాక్, 9 మంది హత్య: డ్రైవర్‌కు మరణశిక్షే
ముంబై: రెండేళ్ల క్రితం బస్సును హైజాక్ చేసి, తొమ్మిది మందిని చంపిన పూణేకు చెందిన బస్సు డ్రైవర్‌కు బొంబాయి హైకోర్టు మరణశిక్షణను ఖాయం చేసింది. 37 ఏళ్ల సంతోష్ ఎం మానే అనే డ్రైవర్ 2012 జనవరిలో రద్దీగా ఉన్న సమయంలో పూణేలో దూసుకుపోతూ బస్సును పాదచారుల మీదికి, ఇతర వాహనాల మీదికి ఎక్కించాడు.
ఆ సంఘటనలో తొమ్మిది మంది మరణించగా, దాదాపు 40 మంది గాయపడ్డారు. దాదాపు పది కిలోమీటర్ల మేర బస్సుతో అతను తీవ్ర భయాందోళనలు సృష్టించాడు. ఈ సంఘటనకు సంబంధించిన కేసులో సిటీ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది.

సిటీ కోర్టు తీర్పును అతను బొంబాయి హైకోర్టులో సవాల్ చేశాడు. అయితే, బొంబాయి హైకోర్టు సిటీ కోర్టు తీర్పును సమర్థించింది. మానే ప్రభుత్వ రవాణా కంపెనీలో పనిచేసేవాడు. అయితే, విధుల్లో లేనప్పుడు బస్సును డిపో నుంచి దొంగిలించాడు.
అయితే, మానే మతిస్థిమితం కోల్పోయిన దశలో బస్సును నడిపాడని అతని తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు.












Click it and Unblock the Notifications