బాధలు పడొద్దని: భార్య, కూతురు, తల్లికి ఉరివేశాడు

తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా సాధ్యం కాలేదని నిందితుడు (రిటైర్డ్ బిపిఓ ఉద్యోగి) సాగర్ గైక్వాడ్ (40) పోలీసులకు తెలిపాడు. తనకు అప్పిచ్చిన వారి నుంచి తన భార్య కవిత (34), కూతురు ఇషిత (8), తల్లి శకుంతల (57)లకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే హత్య చేశానని అతడు చెప్పాడు.
ఓ ప్రైవేటు మనీలాండర్ తానిచ్చిన రూ. 1.90 లక్షలను తిరిగి ఇవ్వాలని గత కొన్ని రోజులుగా తనను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నాడని సాగర్ తెలిపాడు. అంతేగాక కారు కొనేందుకు కో-ఆపరేటివ్ నుంచి రూ. 6 లక్షల అప్పు తీసుకున్నట్లు చెప్పాడు. ఇంకా కారుకు సంబంధించిన రుణం రూ. 4.30 లక్షలు చెల్లించాల్సి ఉందని తెలిపాడు. ఈ అప్పులన్నింటినీ తీర్చేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సాగర్ పేర్కొన్నాడు.
అప్పుల బాధ వల్లే తాను తన కుటుంబ సభ్యులను హత్య చేయాల్సి వచ్చిందని సాగర్ పోలీసులకు తెలిపాడు. అయితే కుటుంబ సభ్యుల హత్యకు అప్పులే కారణమా లేక వేరే ఇతర కారణాలేవైనా ఉన్నాయా అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications