దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

వెల్లడిస్తారా? జైలు కెళ్తారా?: నల్ల కుబేరులకు మోడీ వార్నింగ్

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: నల్లధన కుబేరులకు ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తమ అక్రమాస్తుల వివరాలను ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా బయటపెట్టాలని, లేదంటే జైలుకెళ్లడంతోపాటు కఠిన చర్యలు తప్పని నల్లధన కుబేరులను హెచ్చరించారు. భవిష్యత్‌లో ప్రశాంతంగా నిద్రపోవాలంటే అప్రకటిత ఆదాయ పథకం(ఐడీఎస్-2016) ద్వారా వివరాలు వెల్లడించాలని ఆయన కోరారు.

  దేశంలోని చాలా వరకు నల్లధనం ఆభరణాలు, స్థిరాస్తి రంగాల్లోకి మళ్లిందన్నారు. శనివారం ఆభరణ వ్యాపారులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడారు. ఐడిఎస్ ప్రకటించాక కూడా కొంత మంది నల్లధన కుబేరులు బండ్ల కొద్దీ నోట్ల కట్టలతో బులియన్ వ్యాపారులను సంప్రదిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. సెప్టెంబర్ 30లోగా ఐడిఎస్ పథకాన్ని ఉపయోగించుకుని 45శాతం పన్ను చెల్లించి నిశ్చితంగా ఉండాలని కోరారు.

  పన్నులు ఎగవేతకు పాల్పడిన కొందరిని గతంలో ప్రభుత్వం జైలుకు పంపిన విషయాన్ని మోడీ గుర్తుచేశారు. సెప్టెంబర్ 30 తర్వాత నల్లధనం కలిగినవారిపై కఠినంగా ప్రవర్తించే పరిస్థితులు తీసుకురావొద్దని అన్నారు. పన్ను శాఖ కన్నుగప్పి కూడబెట్టుకున్న అనధికారిక ఆస్తులు, ఆదాయం వివరాలు వెల్లడించేందుకు ఆఖరి అవకాశంగా కేంద్ర ఆర్థిక శాఖ ఐడిఎస్‌ను ప్రవేశపెట్టింది.

  Declare black money by September 30 or face action: PM Narendra Modi

  జూన్ 1న ప్రారంభమైన ఈ ఆఫర్ కాలపరిమితి మరో రెండు నెలల్లో ముగియనుంది. ఈ ఆఫర్ ద్వారా వెల్లడించిన అప్రకటిత ఆదాయం లేదా ఆస్తి మార్కెట్ విలువలో 45 శాతాన్ని పన్ను, పెనాల్టీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వరకు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తూ కేంద్రం ఈమధ్యే గడువు పొడిగించింది.

  ఈ ఆఫర్ ద్వారా వెల్లడించిన ఆస్తులను గోప్యంగా ఉంచుతామని హామీ ఇస్తూ కేంద్రం ప్రత్యేకంగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. పాన్ వివరాలు సమర్పించకుండా జరిపిన 90 లక్షల భారీ లావాదేవీల వివరాలను సేకరించినట్లు ఐటీ శాఖ ఈ వారంలో ప్రకటించింది. వీరిని పాన్ వివరాలివ్వాలని కోరుతూ తొలిదశలో 7 లక్షల మందికి లేఖలు రాయనున్నట్లు ఐటీ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.

  దేశంలో నిరుపయోగంగా ఉన్న 20 వేల టన్నుల బంగారాన్ని తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు ప్రవేశపెట్టిన గోల్డ్ మానిటైజేషన్ స్కీం గురించి మోదీ ప్రస్తావిస్తూ.. బంగారాన్ని ఏడాదిలో కేవలం 2-5 సార్లు ఉపయోగిస్తారని, అందుకుబదులుగా ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేస్తే ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చినవారవుతారని ఆయన పేర్కొన్నారు.

  Declare black money by September 30 or face action: PM Narendra Modi

  ప్రపంచవ్యాప్తంగా ఆభరణాల మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతున్నదని, ముఖ్యంగా కారిగార్లు స్వహస్తాలతో రూపొందించే డిజైన్లకు ఆదరణ పెరుగుతున్నదన్నారు. ఈ నేపథ్యంలో దేశీయ ఆభరణ వర్తకులు అంతర్జాతీయ మార్కెట్‌పైనా దృష్టిపెట్టాలని ప్రధాని సూచించారు. జెమ్స్ అండ్ జువెల్లరీ రంగానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను ఆయన తిరస్కరించారు.

  దిగుమతి సుంకాన్ని 5 శాతానికి తగ్గించండి: జీజేఎఫ్
  బంగారంపై దిగుమతి సుంకాన్ని 5 శాతానికి తగ్గించాలని ప్రధాని మోదీని ఆభరణ వర్తకుల సంఘం ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ (జీజేఎఫ్) కోరింది. అంతేకాదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్కుల తరహాలో ఆభరణాల పార్క్‌లతోపాటు జువెల్లరీ యూనివర్సిటీని, పసిడికి ప్రత్యేక పాలసీని ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

  సమాజంలో తలెత్తుకొని జీవించండి: జైట్లీ

  అక్రమంగా సంపదను పోగేసినవారు సెప్టెంబర్‌ 30లోగా లెక్కలు అప్పజెప్పి, గౌరవంగా తలెత్తుకు జీవించాలని ఆర్థికమంత్రి జైట్లీ హితవు చెప్పారు. నల్లధన మార్గాలు సర్కారుకు తెలుసనీ, అయితే సొంత పౌరులపై అనుక్షణం నిఘావేసే దుస్థితిని ప్రభుత్వం కోరుకోవడం లేదని ఆర్థిక మంత్రి అన్నారు. శనివారం బెంగుళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో జైట్లీ మాట్లాడారు. నల్ల ధనం ఉన్న ప్రతి ఒక్కరికీ, 'అక్రమార్జన వెల్లడి పథకం (ఐడిఎస్‌), 2016' అద్భుత అవకాశమన్నారు.

  పన్నుల ఎగవేతలను నిర్మూలించి, సంపాదించే ప్రతివారు పన్నులు చెల్లించే వ్యవస్థగా భారతను తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ తపన అని ఆయన చెప్పారు. అక్రమార్జన వెల్లడి పథకం ఇందులో భాగమన్న విషయం అందరూ గ్రహించాలని ఆయన చెప్పారు.

  దేశంలో ప్రత్యక్ష పన్నుల భారం తక్కువగానే ఉన్నందున సంపాదించే వ్యక్తులు పన్నులు చెల్లించాల్సిందేనని జైట్లీ స్పష్టం చేశారు. లెక్కల్లో చూపని సొమ్ము ఏయే రంగాల్లో పుట్టుకువస్తుందో ఆదాయం పన్ను శాఖ అధికారులకు తెలుసని ఆయన అన్నారు. ప్రభుత్వానికి పౌరులపై విశ్వాసం ఉండాలనీ, వారి లావాదేవీలపై నిఘావేయాల్సిన స్థితి సంతోషకరమైన విషయం కాదని జైట్లీ చెప్పారు.

  English summary
  Warning black money holders of tringent action including imprisonment after September 30, Prime Minister Narendra Modi on Saturday said those with undisclosed wealth, most of which is parked in jewellery and real estate, should come clean to sleep peacefully.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more