వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్షీణిస్తున్న కరోనా: భారత్ కు బిగ్ రిలీఫ్; తాజా కోవిడ్ పరిస్థితి ఇదే !!

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 15,786 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి 18,454 కేసుల కంటే 14 శాతం తక్కువ. మరణాలు మాత్రం మరోసారి 200 లకు పైగానే నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 230గా నమోదయింది. దీంతో ఇప్పటివరకు కరోనా కారణంగా మొత్తం మరణించిన వారి సంఖ్య 4.53 లక్షల మందికి చేరింది.

వంద కోట్లను దాటిన భారత్ వ్యాక్సినేషన్
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిరంతరం వేగవంతం చేస్తోంది. నిన్నటితో భారతదేశ వ్యాక్సినేషన్ కార్యక్రమం 100 కోట్లను దాటింది. చైనా తర్వాత భారతదేశం వందకోట్ల వ్యాక్సినేషన్ కార్యక్రమంతో చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే వందకోట్ల వాక్సినేషన్ నిర్వహించిన రెండవ దేశంగా భారతదేశం నిలిచింది. భారతదేశంలో 1 బిలియన్ వ్యాక్సిన్ మోతాదులు నిర్వహించడంతో ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశం భయం నుండి భరోసా వైపు పయనించింది అని పేర్కొన్నారు. భారతదేశం సాధించిన ఈ రికార్డ్ కోవిడ్-19 కి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

 Declining corona: Big relief to India; This is the latest Covid situation !!

పెరిగిన కరోనా రికవరీ రేటు .. యాక్టివ్ కేసులు ఇలా ..
కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 98.16 శాతంగా ఉంది, గత 24 గంటల్లో 18,641 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. కోలుకున్న మొత్తం వ్యక్తుల సంఖ్య 3,35,14,449. యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1 శాతం కంటే తక్కువ, ప్రస్తుతం 0.51 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి. మార్చి 2020 తర్వాత ఇప్పుడే అతి తక్కువ యాక్టివ్ కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం యాక్టివ్ కేస్‌లోడ్ 1,75,745 వద్ద ఉంది, ఇది 232 రోజుల్లో అత్యల్పంగా ఉన్న యాక్టివ్ కేసులు.

బాగా తగ్గిన పాజిటివిటీ రేటు, కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ ఇలా
వీక్లీ పాజిటివిటీ రేటు 1.31 శాతం గత 119 రోజులకు 3 శాతం కంటే తక్కువగా ఉంది. గత 53 రోజులుగా రోజువారీ పాజిటివిటీ రేటు 1.19 శాతం 3 శాతం కంటే తక్కువగా ఉంది. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి నివారించడానికి మొత్తం 61,27,277 వ్యాక్సిన్ డోసులు ఇవ్వబడ్డాయి. అక్టోబర్ 21 వరకు పరీక్షించిన నమూనాల సంఖ్య 59,70,66,481 నమోదయింది. నిన్న ఒక్క రోజే 13,24,263 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు.

కరోనా రోజువారీ కేసుల్లో కేరళదే అగ్ర స్థానం ..
దేశంలోనే కరోనా రోజు వారి కేసులను ఎక్కువగా నమోదు చేస్తున్న కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 8733 కరోనా కేసులు నమోదు కాగా, 118 మంది కరోనా మహమ్మారి కారణంగా మరణించారు. కేరళ రాష్ట్రంలో 81, 564 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్రలో గత 24 గంటల్లో 1573 కరోనా కేసులు నమోదు కాగా 39 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 24,292 యాక్టివ్ కేసులున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో 1164 కరోనా కేసులు నమోదు కాగా 20 మంది కరోనా కారణంగా మరణించారు. తమిళనాడులో 13790 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 493 కరోనా కేసులు నమోదు కదా ఏడుగురు మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో 183 కేసులు నమోదు కాగా ఒకరు మరణించారు.

English summary
The corona epidemic in India is gradually coming under control. In the last 24 hours, 15,786 latest Covid-19 cases were reported in India. This is 14 per cent less than yesterday. The death toll is 230 in the last 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X