రివర్స్.. దీప పార్టీలోకి వస్తారు, బీజేపీ కుట్ర.. మోడీ మంచివారు: శశికళ భర్త,
జయలలిత కోడలు దీపా జయకుమార్‌ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆమె త్వరలో పార్టీలో చేరుతారని అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి శశికళ భర్త నటరాజన్ బుధవారం నాడు ఆశాభావం వ్యక్తం చేశారు.
చెన్నై: జయలలిత కోడలు దీపా జయకుమార్‌ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆమె త్వరలో పార్టీలో చేరుతారని అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి శశికళ భర్త నటరాజన్ బుధవారం నాడు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాను రాజకీయ పార్టీని పెడతానని దీపా జయకుమార్ నిన్న ప్రకటించారు. 24వ తేదీని చెబుతానని అన్నారు. ఈ నేపథ్యంలో నటరాజన్ స్పందించారు.
దీపా జయకుమార్, ఆమె సోదరుడు దీపక్.. ఇద్దరు కూడా తమ పిల్లల వంటి వారని చెప్పారు. దీపను కొందరు రాజకీయ నాయకులు తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. ఆమె అసలు విషయం తెలుసుకొని తిరిగి అన్నాడీఎంకేలో చేరుతారని భావిస్తున్నానని చెప్పారు.

కాగా, దీపా పార్టీ పెడతానని ప్రకటించిన మరుసటి రోజు నటరాజన్ సానుకూలంగా మాట్లాడిన నేపథ్యంలో శశికళ ఆత్మరక్షణలో ఉన్నట్లుగా మరింత భావిస్తున్నారు.
బీజేపీలో కొందరు నాయకులు తమ పార్టీ పైన కుట్రలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. పార్టీని చీల్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారని, కానీ వారి ప్రయత్నాలు సఫలం కావన్నారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ చాలా మంచివారు అని నటరాజన్ చెప్పడం గమనార్హం.
జల్లికట్టును నిషేధించడం పైన ఘాటుగా స్పందించారు. ఇది తమిళనాడు సంప్రదాయానికి తీవ్ర అవమానమని చెప్పారు. ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిరసనకారుల గురించి మాట్లాడుతూ.. వారు తమిళుల హక్కుల గురించి పోరాడుతున్నారని చెప్పారు. కాగా, కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయాలని శశికళ, సీఎం పన్నీరు సెల్వం కూడా కోరుతున్నారు.
తాను రాజకీయ ఆరంగేట్రం చేస్తానని దీపా జయకుమార్ మంగళవారం ప్రకటించారు. అంతేకాదు, శశికళను అన్నాడీఎంకే అధినేత్రిగా అంగీకరించేది లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications