జయ ఆస్తులు నాకే దక్కాలి: పోయెస్ గార్డెన్ వద్ద దీప హంగామా

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా ఆదివారం ఉదయం పోయిస్ గార్డెన్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆమెను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.

జయలలిత నివాసమైన వేదనిలయం ఇంటిపై హక్కులు తనవేనని దీప వాదిస్తున్నారు. దీప తన మద్దతుదారులతో కలసి పోయిస్ గార్డెన్‌లోకి వెళ్లారు. జయ ఇంటికోలి చొచ్చుకు పోయే ప్రయత్నం చేయడంతో అడ్డుకున్నారు.

Deepa stakes claim to Jaya's Poes Garden residence, denied entry

ఈ సందర్భంగా దీపకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఇంటిపై మరెవరికీ హక్కులు లేవని, ఇది తమకు వారసత్వంగా వచ్చిన భవంతి అని దీప వ్యాఖ్యానించారు.

దీపా రావడంతో ఈ ప్రాంతంలోని వేదనిలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోయిస్ గార్డెన్‌కు దూసుకెళ్లిన దీప.. పోలీసులు అడ్డుకోవడంతో వేదనిలయంలోకి మాత్రం వెళ్లలేకపోయారు.

దీప మీడియాతో మాట్లాడారు. 'మా అత్త ఆస్తి మాకు చెందాలి. నేను ఆమె వారసురాలిని' అని దీప అన్నారు. కాగా, దీపను అడ్డుకున్న వారిలో భద్రతా సిబ్బందితో పాటు టిటివి దినకరన్ మద్దతుదారులు కూడా ఉన్నారని తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Dramatic scenes were witnessed outside Jayalalithaa's Poes Garden residence on Sunday with Deepa Jayakumar's visit. J Jayalalaithaa's niece Deepa Jayakumar arrived at Veda Nilayam staking claim but was denied entry by security personnel. A three-tier security continues to be imposed at the empty mansion.
Please Wait while comments are loading...