వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రివిలైజ్ కమిటీకి ఫిరాయింపులు: తెలుగు ఎంపీలపై అనర్హత కత్తి?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు నేలపై ఒక పార్టీ నుంచి ఎన్నికై మరొక పార్టీలోకి ఫిరాయించిన లోక్‌సభ సభ్యులు అనర్హత వేటును ఎదుర్కోబోతున్నారని దేశ రాజధాని నగరం హస్తినలో జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. పార్టీ ఫిరాయించిన సభ్యులపై 'పార్టీ ఫిరాయింపుల చట్టం' ప్రకారం అనర్హత వేటు వేయాలని ఇప్పటికే టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు ఫిర్యాదు చేశాయి.

ఈ అంశాలపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ పరిశీలించినట్లు తెలుస్తోంది.
స్పీకర్ ఆదేశాల మేరకు ప్రివిలైజ్ కమిటీ ప్రస్తుత శీతాకాల సమావేశాలు ముగించేలోగా స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు నివేదిక సమర్పిస్తారని సమాచారం. ఆ వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆయా నివేదికల ఆధారంగా సదరు ఎంపీలపై అనర్హత వేటు వేయనున్నారని విశ్వసనీయంగా తెలియవచ్చింది.

తెలంగాణలో మూడు పార్టీల నుంచి టీఆర్ఎస్‌లోకి లోక్‌సభ సభ్యులు

తెలంగాణలో మూడు పార్టీల నుంచి టీఆర్ఎస్‌లోకి లోక్‌సభ సభ్యులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎస్పీవై రెడ్డి (నంద్యాల), కొత్తపల్లి గీత (అరకు), బుట్టా రేణుక (కర్నూల్) అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. వీరు ముగ్గురిపైనా అనర్హత ‘కత్తి' వేలాడుతూనే ఉన్నది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి (నల్లగొండ), టీడీపీ లోక్ సభ సభ్యుడు సీహెచ్ మల్లారెడ్డి (మల్కాజిగిరి) అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించేశారు. అయితే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే టీడీపీలో చేశారు.

 మల్లారెడ్డిపై ఫిర్యాదు పట్ల టీడీపీ నిర్లక్ష్యం

మల్లారెడ్డిపై ఫిర్యాదు పట్ల టీడీపీ నిర్లక్ష్యం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్ సభకు ఎన్నికైన కొత్తపల్లి గీత, బుట్టా రేణుక ‘సేఫ్' గేమ్ ఆడుతున్నారు. తమ విధేయతలను టీడీపీకి అనుకూలంగా మార్చేసుకున్నారు. అధికారికంగా టీడీపీలో చేరలేదు. సాంకేతికంగా మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా ఉన్నారు. ఎందుకంటే వారు అధికారికంగా ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు. ఇదే పరిస్థితి హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి నుంచి ఎన్నికై టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ ఎంపీ మల్లారెడ్డికి కూడా వర్తిస్తుంది. అతడిపై టీడీపీ నాయకత్వం అనర్హత పిటిషన్ దాఖలు చేసినా ఇప్పటికీ పట్టించుకోలేదు. ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకత్వంతో టీడీపీ సంబంధాల్లో మార్పు వచ్చినందున మల్లారెడ్డిపై సమర్పించిన పిటిషన్ ఊసే ఎత్తడం లేదు. కనుక మల్లారెడ్డి సురక్షితంగా బయటపడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

 టీఆర్ఎస్ వ్యూహంలో గుత్తాది కీలక పాత్ర

టీఆర్ఎస్ వ్యూహంలో గుత్తాది కీలక పాత్ర

కానీ నల్లగొండ నుంచి ఎన్నికైన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిణమిస్తోంది. ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరినా అధికారికంగా ‘గులాబీ' కండువా కప్పుకోలేదు. సాంకేతికంగా కాంగ్రెస్ పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నా.. తెలంగాణ కాంగ్రెస్ నేతలపై విమర్శల దాడి పెంచుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ అమలు చేస్తున్న వ్యూహంలో భాగస్వామిగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం.. గుత్తా సుఖేందర్ రెడ్డిపై అనర్హత వేటు కోసం ప్రయత్నిస్తోంది.

 శ్రీనివాసరెడ్డిపై ఫిర్యాదే చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

శ్రీనివాసరెడ్డిపై ఫిర్యాదే చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

తెలంగాణలోని ఖమ్మం స్థానం నుంచి ఎన్నికైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డిపైనా అనర్హత వేటు వేలాడుతోంది. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ స్పీకర్‌కు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. కనుక అనర్హత వేటు నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తప్పించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ అనర్హత పిటిషన్లన్నీ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదిస్తే రెండు రాష్ట్రాల్లోనూ త్వరలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ ఫిరాయింపులపై తుది నిర్ణయం తీసుకోవాలంటే స్పీకర్ సుమిత్రా మహాజన్ ముందు ఎంపీలందరి అభిప్రాయాలు స్వయంగా తెలుసుకోవాలి. వారి వాదనలు విన్న తర్వాతే తుది నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అయితే సార్వత్రిక ఎన్నికలకు ఏడాది లోపే సమయం ఉంటే మాత్రం ఉప ఎన్నికలు జరుగవు. అంటే వచ్చే మే లోపు స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలన్నమాట.

 అన్వర్ అలీ, శరద్ యాదవ్‌లపై ఇలా వెంకయ్య వేటు

అన్వర్ అలీ, శరద్ యాదవ్‌లపై ఇలా వెంకయ్య వేటు

ఈ క్రమంలో ఒక విషయం గుర్తు చేయాల్సి ఉన్నది. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఎక్స్ అఫిసియో చైర్మన్ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తన ముందుకు వచ్చిన అనర్హత పిటిషన్లను విచారించారు. అవి యునైటెడ్ జనతాదళ్ (జేడీయూ) తిరుగుబాటు నేతలు శరద్ యాదవ్, అన్వర్ అలీలపై వేటేశారు. ఇటీవలి వరకు జేడీయూ అధ్యక్షుడిగా వ్యవహరించిన శరద్ యాదవ్ స్థానే బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. ఆ తర్వాతే తిరిగి బీజేపీతో నితీశ్ కుమార్ జత కట్టారు. దీన్ని వ్యతిరేకించిన సీనియర్ నేతలు శరద్ యాదవ్, అన్వర్ అలీ అడ్డం తిరిగారు. తిరిగి ఎన్నికల సంఘం వరకు ఆ పంచాయతీ వెళ్లింది.

 మూడు నెలల్లో పిటిషన్లు తేల్చేయాలన్న వెంకయ్య

మూడు నెలల్లో పిటిషన్లు తేల్చేయాలన్న వెంకయ్య

నితీశ్ కుమార్‌దే అసలుసిసలు జేడీయూ అని ఈసీ తేల్చేసింది. ఆ వెంటనే శరద్ యాదవ్, అన్వర్ అలీలను అనర్హులుగా ప్రకటించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ముందు పిటిషన్ దాఖలు చేసింది. వాటిని పరిశీలించిన తర్వాత వారి వివరణ పరిశీలించిన మీదట పాత సంప్రదాయాలేవీ పరిగణనలోకి తీసుకోకుండా సస్పెన్షన్ వేటు వేసిన వెంకయ్యనాయుడు ఫిరాయింపు దార్లపై అనర్హత పిటిషన్లను మూడు నెలల్లో తేల్చేయాలని తీర్మానించేశారు.

 వెంకయ్య సూచనను తెలుగు స్పీకర్లు పాటిస్తారా?

వెంకయ్య సూచనను తెలుగు స్పీకర్లు పాటిస్తారా?

ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు సన్నిహితులుగా ఉన్న తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, బీజేపీ మిత్రపక్షం టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు కూడా ఇతర పార్టీల ఎంపీలను ప్రోత్సహించేశారన్న సంగతి ప్రస్తావనార్హం. ఫిరాయింపులను మూడు నెలల్లో తేల్చేయాలని చేసిన సూచనను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు విశ్వాసంలోకి తీసుకుంటారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. తెలంగాణలో 15 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 12 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరిపోతే రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీకి గూటికి చేరారు. మిగతా ఇద్దరిలో సండ్రవెంకట వీరయ్య ఎన్నికల నాటికి టీఆర్ఎస్ గూటికి చేరతారా? కాంగ్రెస్ పార్టీకి సన్నిహితం అవుతారా? తెలియాల్సి ఉంది. ఇక ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ క్రుష్ణయ్య రాజకీయ భవితవ్యం కూడా ఒకింత అన్యమనస్కంగానే ఉంది.

 స్పీకర్లపై జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానాలకు నో

స్పీకర్లపై జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానాలకు నో

ఫిరాయింపుదార్లపై దాఖలైన పిటిషన్ల విషయమై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి బహిరంగంగా స్పందించలేదు. కానీ ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాత్రం ఫిరాయింపులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసినందున తానేమీ నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు చెప్పారు. చట్టసభల అధిపతుల (స్పీకర్, చైర్మన్లు) అధికారాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకునే అధికారాలు లేవు. కానీ ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు.. సుప్రీంకోర్టులో కేసు సాకు చెప్పేశారు. అంటే ఫిరాయింపుల సంగతి దాటేయడం అంటే పరోక్షంగా అధికార పక్షానికి మద్దతు పలుకడమే.

English summary
If the reports from New Delhi are to be believed, the Lok Sabha members who defected from one party to the other in both the Telugu states of Andhra Pradesh, are likely to be disqualified soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X