మోడీ స్టాండ్‌బై విమానంలోది ప్లాస్టిక్ ర్యాపరే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ కోసం ఉంచిన అదనపు విమానంలో పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. ఎయిర్ ఇండియా జంబో ఎయిర్‌క్రాఫ్ట్‌లో నిర్వీర్యం చేసిన ఓ గ్రెనేడ్‌ను గత రాత్రి గుర్తించారు. బోయింగ్ 747 - 400 విమానంలో ఈ పేలుడు పదార్థాన్ని బిజినెస్ క్లాస్ సిబ్బంది చూసినట్లు ఎయిర్‌లైన్స్ అధికారులు శనివారంనాడు చెప్పారు.
ఇటీవల నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అందుకోసం స్టాండ్‌బైగా ఈ విమానాన్ని సిద్ధంగా ఉంచారు. ముంబై - హైదరాబాద్ - జెడ్డా మధ్య నడిచే ఈ విమానం ప్రస్తుతం జెడ్డాలో ల్యాండయింది. ఆ ఘటనపై ఎయిర్ ఇండియా విచారణకు ఆదేశించింది. మరోవైపు నరేంద్ర మోడీ భద్రతను కట్టుదిట్టం చేశారు.

జెడ్డాలో దిగిన తర్వాత ఈ సంఘటనపై స్థానిక భద్రతా సంస్థలకు వివరాలు ఇచ్చారు. విమానం ఇంకా నగరంలో ఉంది. భారత భద్రతాధికారులు దర్యాప్తు చేస్తుండడంతో దాన్ని అక్కడే ఆపేశారు. ఆ విమానం త్వరలో కాలికట్ చేరుకునే అవకాశం ఉంది.
ఆ విమానం బోర్డులో అనుమానాస్పద వస్తువు కనిపించిందని, దర్యాప్తు సాగుతోందని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి చెప్పారు. అయితే, అది నిర్వీర్యం చేసిన గ్రెనేడ్ కాదని, కేవలం ప్లాస్టిక్ ర్యాపరేనని తేలింది. దీంతో అధికారులు ఊపరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications