ప్రచారం జరిగింది: అతను, ఇతను ఒక్కటి కాదా?
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అర్వింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. స్వయంగా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను మట్టి కరిపించగా పార్టీ అభ్యర్థులు పలువురు హేమాహేమీలను ఓడించారు. కాంగ్రెసును ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా చిత్తు చేసింది. ఈ ఎన్నికల్లో అనూహ్యమైన గెలుపు ఒకటి ఉందంటూ ప్రచారం జరిగింది.
గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరంపై బూటు విసిరిన జర్నైల్ సింగ్ ఆమ్ ఆద్మీ తరఫున పోటీ విజయం సాధించారని పుకార్లు షికార్లు చేశాయి. జర్నైల్ సింగ్ బూటు విసిరిన సందర్భంలో చిదంబరం హోం మంత్రిగా ఉన్నారు. అందుకు అతన్ని పోలీసులు అరెస్టు కూడా చేశారు. జర్నైల్ సింగ్ ఢిల్లీలోని తిలక్‌నగర్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైనట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆ జర్నైల్ సింగ్, ఈ జర్నైల్ సింగ్ ఒక్కరు కాదని అంటున్నారు.

చిదంబరంపై బూటు విసిరిన జర్నైల్ సింగ్ ఇంతకు ముందు జగ్రాన్‌లో జర్నలిస్టుగా పనిచేసేవారు. అతనే ఈ ఎన్నికల్లో బిజెపి అధికార ప్రతినిధిు రాజీవ్ బబ్బర్‌ను 2 వేల ఓట్ల మెజారిటీతో ఓడించారని వార్తలు వచ్చాయి. అయితే, అది నిజం కాదని అంటున్నారు. ఈ 33 ఏళ్ల సింగ్ అన్నా హజారే జన్ లోక్‌పాల్ బిల్లు కోసం చేసిన ఆందోళనలో చురుగ్గా పాల్గొన్నారు.
1984 సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెసు నేత జగదీష్ టైట్లర్‌కు సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వడంపై మండిపడిన జర్నలిస్టు జర్నైల్ సింగ్ మీడియా సమావేశంలో అప్పటి హోం మంత్రి పి. చిదంబరంపై బూటు విసిరాడు. ఐ ప్రొటెస్ట్ అంటూ బూటు విసిరాడు. అయితే, క్షమాపణలు చెప్పడంతో అప్పట్లో సింగ్‌పై కేసు నమోదు చేయలేదు.












Click it and Unblock the Notifications