ఓర్నీ .. ఇంత యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నావ్ తల్లీ..!
దిల్లీ యాసిడ్ దాడి ఘటనలో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తనపై కొందరు వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారని ఆ సమయంలో తాను ముఖానికి చేతులు అడ్డుపెట్టుకోవడంతో చేతులకు తీవ్ర గాయాలయ్యాయని ఆ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని పోలీసులు నిజంగానే నమ్మేశారు. కేసు నమోదు చేశారు. కానీ 24 గంటల తర్వాత పోలీసుల ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇదంతా ఆ యువతి, ఆమె తండ్రి కట్టుకథ అని తెలిసి బిత్తరపోయారు. ఘటనా స్థలిలో సీసీ కెమెరాలు, నిందితుల ఫోన్లు ట్రాకింగ్ లాంటి అధునాతన సాంకేతికతో కేసును ఛేదించారు.
ఓ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆ విద్యార్థిని తండ్రి రచించిన పథకంగా పోలీసులు తేల్చారు. పరారీలో ఉన్న విద్యార్థిని తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యాసిడ్ దాడికి పాల్పడినట్లు చెబుతున్న ఆ ముగ్గురు యువకుల్లో ప్రధాన నిందితుడిగా భావించిన జితేందర్ భార్యపై విద్యార్థిని తండ్రి వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. అయితే ఇదే విషయంపై అతడిపై కేసు కూడా నమోదైనట్లు తేలింది.
Acid Attack was a Planted Incident by the father of the girl? Police is probing
— Atulkrishan (@iAtulKrishan1) October 27, 2025
The first photo is of the wife of Jitender , the prime accused in the acid attack case
Second is video of the girl who alleged she was attacked with acid
Allegations were on Jitender, Ishan and… pic.twitter.com/5Th655pAF8
తనపై కేసు పెట్టారన్న కోపంతో తన కూతుర్ని ఈ విధంగా యాసిడ్ దాడి నాటకం ఆడించి.. ఆ ముగ్గురే తనపై దాడి చేశారని చెప్పమన్నాడు. ఆ విద్యార్థిని తండ్రి చెప్పినట్లు యాసిడ్ దాడి ప్లాన్ ను అమలు చేసింది. ఎట్టకేలకు తండ్రి ముందే ఆ యువతి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఇదేం ట్విస్ట్ రా నాయనా అంటూ అవాక్కయ్యారు. అయితే యువతిపై చల్లింది యాసిడ్ కాదని.. అది టాయిలెట్ క్లీనర్ అని తేలింది. అంతేకాక యువతి చేతులకు ఏమీ కాలేదని.. బ్యాండేజీ కట్లు కట్టి ఆ ముగ్గురు యువకుల్ని కేసులో ఇరికించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.

ఇలా అబద్ధపు ఫిర్యాదు చేసి, తమ విలువైన సమయాన్ని వృథా చేసినందుకు ఆ విద్యార్థిని, ఆమె తండ్రిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన వెంటనే దేశ రాజధానిలో తీవ్ర ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. దీంతో వెంటనే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. కానీ దర్యాప్తులో ఇదంతా కట్టుకథ అని తేలడంతో దేశవ్యాప్తంగా ప్రజలు షాక్ అవుతున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications