దేశ రాజధానిలో భూప్రకంపనలు: ఉత్తరాఖండ్, హిమాలయ పర్వత సానువుల్లో..!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మంగళవారం సాయంత్రం భూమి ప్రకంపించింది. న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమిని కంపించింది. రాజధాని సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోని అనేక ప్రాంతాల్లోనూ ఇవే తరహా ప్రకంపనలు నమోదైంది. దీనితో- భారీ భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి రోడ్ల మీదికి పరుగులు తీశారు.
ఉత్తరాఖండ్ పరిధిలోని హిమాలయ పర్వత సానువుల్లో ఓ మోస్తరు భూకంపం చోటు చేసుకుందని, దాని ప్రభావం దేశ రాజధానిపై పడిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. భారత్-నేపాల్ సరిహద్దు ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. సరిహద్దుల్లోని ఖప్తారా నేషనల్ పార్క్ పరిధిని భూకంప కేంద్రంగా నిర్ధారించారు. దాని ఫలితంగా- న్యూఢిల్లీ సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు అంచనా వేస్తున్నారు.

భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఏర్పడినట్టుగా అనుమానిస్తోన్న భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది ఇంకా తెలియరాావాల్సి ఉంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై అయిదు వరకు ఉండొచ్చని చెబుతున్నారు. ఈ విషయాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. కొద్దిరోజుల కిందటే న్యూఢిల్లీలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ మొదలుకుని న్యూఢిల్లీ వరకు ఈ భూకంప తీవ్రత కనిపించింది.
సోమవారం సాయంత్రం కూడా గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న కఛ్-భచావూ-అంజార్ ప్రాంతంలో భూకంప తీవ్రత నమోదైంది. కఛ్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో 4.3 తీవ్రతతో భూమి కంపించింది. భచావూ నుంచి పాకిస్తాన్ భూభాగం వైపు సుమారు 23 కిలోమీటర్ల దూరాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications