Delhi Assembly Election 2025: అసెంబ్లీ పోలింగ్.. ఢిల్లీ ఓటర్లకు ప్రధాని మోడీ, అమిత్ షా సూచన
Delhi Assembly Election 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 19.95 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిసింది. ఢిల్లీ ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, కేంద్ర మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోని అన్ని స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోందని ప్రధాని మోడీ ఎక్స్(ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. ఇక్కడి ఓటర్లందరూ ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పూర్తి ఉత్సాహంతో పాల్గొని తమ విలువైన ఓటును వేయాలని ప్రధాని కోరారు. మొదటిసారి ఓటు వేయబోతున్న యువ ఓటర్లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొదట ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటింగ్ లో కొత్త రికార్డును నెలకొల్పాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు.

दिल्ली विधानसभा चुनाव में आज सभी सीटों के लिए वोट डाले जाएंगे। यहां के मतदाताओं से मेरा आग्रह है कि वे लोकतंत्र के इस उत्सव में पूरे उत्साह के साथ हिस्सा लें और अपना कीमती वोट जरूर डालें। इस अवसर पर पहली बार वोट देने जा रहे सभी युवा साथियों को मेरी विशेष शुभकामनाएं। याद रखना है-…
— Narendra Modi (@narendramodi) February 5, 2025
ఆ సమయంలోనే హోంమంత్రి అమిత్ షా కూడా ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోలింగ్ గురించి ప్రజలకు సూచించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోయే సోదర సోదరీమణులు తప్పుడు వాగ్దానాలు, కలుషిత యమునా నది, మద్యం దుకాణాలు, చెడిపోయిన రోడ్లు, మురికి నీటికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజా సంక్షేమం పట్ల బలమైన ట్రాక్ రికార్డ్, ఢిల్లీ అభివృద్ధి పట్ల స్పష్టమైన దార్శనికత కలిగిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు మీ ఒక్క ఓటు ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాజధానిగా మార్చగలదన్నారు.
दिल्ली विधानसभा चुनाव में मतदान के लिए जा रहे बहनों-भाइयों से अपील करता हूँ कि वे झूठे वादों, प्रदूषित यमुना, शराब के ठेकों, टूटी सड़कों और गंदे पानी के खिलाफ वोट करें। आज एक ऐसी सरकार बनाने के लिए बढ़-चढ़कर मतदान करें, जिसके पास जनकल्याण का मजबूत ट्रैक रिकॉर्ड हो और दिल्ली के…
— Amit Shah (@AmitShah) February 5, 2025
ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాలకు బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 70 స్థానాలకు మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1.56 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తమ పూర్తి బలాన్ని వినియోగించుకున్నాయి. త్రిముఖ పోరులో ఆప్, బీజేపీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఈ నెల 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications