కారులోంచి మహిళను తోసేశారు: రేప్ చేశారని అనుమానం

బాధితురాలు ఢిల్లీలోని సలీంపురి వాసి. బర్లా గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం స్పృహ లేని స్థితిలో పడి ఉంది. అమ్మాయిపై దుండగులు అత్యాచారం చేసి, ఆ తర్వాత కదులుతున్న కారులోంచి కిందికి తోసేసి ఉంటారని పోలీసులు అంటున్ారు.
బాధితురాలని ఆస్పత్రిలో చేర్చారు. స్పృహలోకి రాగానే ఆమె వాంగ్మూలం తీసుకుంటారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భార్య కజిన్‌ను కిడ్నాప్ చేసిన వ్యక్తి
వివాహ సంబంధమైన వివాదంలో ఓ వ్యక్తి భార్యకు చెందిన ఆరేళ్ల కజిన్‌ను కిడ్నాప్ చేశాడు. ఈ సంఘటనలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. తనకూ తన భార్యకు మధ్య నెలకొన్న వివాదాన్ని ముగించాలనే డిమాండ్ పెట్టడానికి అతను ఆ పనికి ఒడిగట్టాడు. కజిన్‌ను ఎత్తుకుని పశ్చిమ బెంగాల్‌లోని తన స్వస్థలానికి వెళ్లి అత్తగారింటివారిని బ్లాక్ మెయిల్ చేయాలని చూశాడు. నిందితుడు అశ్వని దాస్ కోట్ల ముబారక్‌పూర్‌కు చెందినవాడు.












Click it and Unblock the Notifications