రివర్స్: మోడీ వేవ్‌కు కేజ్రీవాల్ అడ్డుకట్ట? కిరణ్ బేడీతో తారుమారు

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సమీకరణాలు మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు భారతీయ జనతా పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయని, అధికారంలోకి వస్తాయని చెప్పిన సర్వేలు.. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చెబుతున్నాయి.

నిన్నటి వరకు బీజేపీకి 35 నుండి 37 సీట్లు వస్తాయని సర్వేలు చెప్పాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి 29 సీట్లు రావొచ్చని చెప్పాయి. తాజా సర్వేలు కేజ్రీవాల్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఏఏపీ ఢిల్లీ పీఠం కైవసం చేసుకుంటుందని చెబుతున్నాయి. తద్వారా ప్రధాని నరేంద్ర మోడీ మసకబారుతోందా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

సార్వత్రిక ఎన్నికలకు ముందు నుండి దేశంలో మోడీ వేవ్ జోరుగా కనిపించింది. అది మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలలోను కనిపించింది. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోను మోడీ వేవ్ కారణంగా బీజేపీకి ఢోకా లేదనే వాదనలు వినిపించాయి. సర్వేలు కూడా అవే చెప్పాయి.

 Delhi battlefield 2015: Has the Modi momentum stopped? Kejriwal's AAP to get majority, predicts

అక్కడే సమీకరణాలు మారాయా?

అయితే, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ బీజేపీలో చేరడం, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు రావడంతో సమీకరణాలు మారాయని అంటున్నారు. బేడీ చేరిక వల్ల స్థానిక బీజేపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. కిరణ్ బేడీ చేరిక వల్ల.. మోడీ, అమిత్ షాలు పక్కకు పోయి ఆమె హవానే ఢిల్లీలో కనిపిస్తోందని అంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మోడీ, షాలను పక్కన పెట్టి కిరణ్ బేడీని పైన విరుచుకుపడుతోంది.

అదే బీజేపీకి మైనస్ అవుతోందని చెబుతున్నారు. కిరణ్ బేడీ చేరకపోయి ఉంటే మోడీ హవా అలాగే కొనసాగి ఉండేదని, ఆమె చేరిక వల్ల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆమె అయ్యారని, తద్వారా బీజేపీ వెనుకంజ వేసే పరిస్థితి వచ్చిందంటున్నారు. అది ఆమ్ ఆద్మీ పార్టీకి బాగా లాభిస్తుందని చెబుతున్నారు. దీనిని కొందరు మోడీ పైన కేజ్రీవాల్ పైచేయిగా భావిస్తే, మరికొందరు బేడీ రాక వల్ల మోడీ వేవ్ పక్కకు పోయిందని, ఆమె వల్లనే కేజ్రీవాల్ పార్టీ దూసుకుపోతోందంటున్నారు.

ఏ సర్వేలు ఏం చెబుతున్నాయి?

ఇండియా టుడే ప్రకారం.. బీజేపీకి 19-25, ఏఏపీకి 38-46, కాంగ్రెస్‌కు 3-7, టైమ్స్ నౌ ప్రకారం.. బీజేపీకి 32, ఏఏపీకి 34, కాంగ్రెస్‌కు 4, ఎన్డీటీవీ ప్రకారం.. బీజేపీకి 29, ఏఏపీకి 37, కాంగ్రెస్‌కు 4, ఏబీపీ న్యూస్ ప్రకారం.. బీజేపీకి 29, ఏఏపీకి 35, కాంగ్రెస్‌కు 6, ఎకనామిక్స్ టైమ్స్ ప్రకారం.. బీజేపీకి 30, ఏఏపీకి 38, కాంగ్రెస్‌కు 2, హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం.. బీజేపీకి 27-32, ఏఏపీకి 36-41, కాంగ్రెస్‌కు 2-7, సీ-ఓటర్ ప్రకారం.. బీజేపీకి 37, ఏఏపీకి 28, కాంగ్రెస్‌కు 5, వీక్ ప్రకారం.. బీజేపీకి 36, ఏఏపీకి 29, కాంగ్రెస్‌కు 4 సీట్లు రానున్నాయి.

తలీమ్ రీసెర్చ్ ఫౌండేషన్‌తో కలిపి జీ న్యూస్ జరిపిన సర్వేలో బీజేపీకి 39.7 శాతం ఓఠ్లు, ఏఏపీకి 46 శాతం ఓట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి 14.3 శాతం వస్తాయి. 49 శాతం మంది కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా ఓకే అన్నారు. కిరణ్ బేడీకి 40 శాతం మంది ఓటేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+