కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి, పలువురికి ప్రమాదం!
దేశ రాజధాని ఢిల్లీలోని పాత ఢిల్లీ పరిధిలోని చావ్డి బజార్ ప్రాంతంలో గురువారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 9.50 గంటల ప్రాంతంలో చావ్డి బజార్ మెట్రో స్టేషన్ సమీపంలోని 'గలీ సితారా'లో ఈ ప్రమాదం సంభవించింది. భవనం ఒక్కసారిగా నేలమట్టం కావడంతో ఈ ప్రాంతమంతా దట్టమైన ధూళి, కేకలతో నిండిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఆరు అగ్నిమాపక యంత్రాలు, వాటర్ టెండర్లు, ప్రత్యేక రెస్క్యూ వాహనాలతో సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ముమ్మరంగా శ్రమిస్తున్నారు.

వరుస ఘటనలతో కలకలం
ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న భవనాలు కూలిపోవడం కొన్ని రోజులుగా వరుసగా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈశాన్య ఢిల్లీలోని మిలన్ గార్డెన్ ప్రాంతంలో పాత ఇంటిపై కొత్త అంతస్తు నిర్మిస్తుండగా.. స్లాబ్ కూలి చంద్రపాల్(60), విజయ్ కుమార్(33) అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అంతకుముందు అక్టోబర్ 7న సీమాపురి ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం కూలిపోవడంతో ఓ చిన్నారితో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.
రాజకీయ దుమారం
ఈ ఘోర ప్రమాదంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ తీరును ఆయన తప్పుబట్టారు. గతంలో దక్షిణ ఢిల్లీలోని సత్యనికేతన్‌లోని ఓ పీజీ భవనం కూలిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అనేక సేఫ్టీ ఆడిట్లు నిర్వహించిందని గుర్తు చేస్తూ.. "రేఖా గుప్తా ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ) అన్ని భవనాలకు సేఫ్టీ ఆడిట్లు చేశామని చెహుతున్నా, ఇప్పటికీ ఇలా భవనాలు ఎందుకు కూలిపోతున్నాయి?" అని సౌరభ్ భరద్వాజ్ నిలదీశారు.
#WATCH | Delhi: Visuals from the spot where a portion of an under construction building collapsed in Delhi’s Chawri Bazaar area.As per Delhi Police, two people have lost their lives and one is injured in the incident. https://t.co/GlOacjVLld
— ANI (@ANI) November 5, 2026














Click it and Unblock the Notifications
