గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా - సీఎం రేవంత్ లిస్టులో..!?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతోంది. దీంతో, వచ్చే ఎన్నికలే లక్ష్యం గా సీఎం రేవంత్ ప్రతీ నిర్ణయం ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికల దిశగా కసరత్తు జరుగుతోంది. అదే విధంగా గ్రేటర్ తో పాటుగా ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ సమయంలోనే గవర్నర్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల విషయంలో సీఎం రేవంత్ ముఖ్య నేతలతో చర్చ లు చేసినట్లు తెలుస్తోంది. గతంలో సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధుల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
సీఎం రేవంత్ కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. కీలక నిర్ణయాలకు సిద్దం అయ్యారు. అందు లో భాగంగా తెలంగాణలో గవర్నర్ కోటా మూడు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కానున్నాయి. ఈ సీట్ల ఖరారు పైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ ఈ సీట్ల ఖరారు వేళ పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారు. సామాజిక వర్గాల వారీగా ఎవరికి సీట్లు కేటాయిస్తారనేది స్పషత వస్తోంది. ఓ స్థానాన్ని పద్మశాలీలకు, మరోస్థానాన్ని ముదిరాజ్ కులస్తులకు కేటాయించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మేరకు రేవంత్ ఇచ్చిన సంకేతాలు క్లియర్ గా ఉన్నాయి. ఇక.. మూడో స్థానం కోసం పోటీ పెరుగుతోంది. సామాజిక సమీకరణాలే కీలకంగా మారాయి. తెలంగాణ ఉద్యమకారులు, అమరుల కుటుంబాలు, వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులు సైతం ఈ మూడో స్థానం కోసం పోటీ పడుతున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ సుదీర్ఘ కసరత్తు
కాగా.. పద్మశాలి వర్గం నుంచి కొండడా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె డాక్టర్ పవిత్ర వాణి కి ఛాన్స్ దక్కుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అదే విధంగా మరో సీటు ముదిరాజ్ వర్గానికి ఇవ్వటం దాదాపు ఖాయమైంది. అందులో భాగంగా ఈ వర్గం నుంచి నీలం మధు, ఎం. సునీత రావు వంటి నాయకులు తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. మూడో స్థానం కోసం ఓసీ వర్గాల నుంచి ఆర్‌టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ రావు, గుండెపల్లి దయా సాగర్, పవన్ మల్లాది, టీపీసీసీ ఉపాధ్యక్షుడు టి. కుమార్ రావు, టీశాట్ సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తదితరులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అదే విధంగా ఎస్సీ వర్గాలకు కేటాయిస్తే సంపత్ కుమార్ కు ఛాన్స్ దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. బీసీ వర్గాల నుంచి సట్టు మల్లేశం, చనగాని దయాకర్, చరణ్ కౌశిక్ యాదవ్, లోకేష్ యాదవ్, నేరెళ్ల శారద పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నాయి. దీంతో.. మూడో స్థానంలో రేవంత్ ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తి కరంగా మారుతోంది. కాగా.. ఫైనల్ గా ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తి పెంచుతోంది.













Click it and Unblock the Notifications
