Vande Bharat Sleeper: కొత్త వందే భారత్ స్లీపర్ ల పరుగు మొదలు- ఏపీ సహా 2 రూట్లలో-రూల్స్ ఇవే..!

భారతీయ రైల్వేలో ప్రీమియర్ రైళ్లుగా పేరు తెచ్చుకున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ (Vande Bharat Sleeper Trains) ఇవాళ రెండు మార్గాల్లో రాకపోకలు ప్రారంభిస్తున్నాయి. ఇందులో వారణాసి-ఢిల్లీ, ముంబై-బెంగళూరు మార్గాలున్నాయి. వీటిని తాజాగా అధికారికంగా జెండా ఊపి ప్రారంభించగా.. ఇవాళ్టి నుంచి రాకపోకలు సాగించబోతున్నాయి. ఈ రెండు రైళ్లలోనూ 16 కోచ్ ల చొప్పున ఉంటాయి. అలాగే ఫస్ట్, సెకండ్, ధర్డ్ ఏసీ కోచ్ లు మాత్రమే ఉంటాయి. టికెట్ కన్ఫమ్ అయిన ప్రయాణికులు మాత్రమే రైలు ఎక్కేందుకు అనుమతిస్తారు.

వారణాసి-న్యూఢిల్లీ వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper)

వారణాసి-న్యూఢిల్లీ వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ (27421) ప్రతి శుక్రవారం మినహా వారంలో అన్ని రోజులు నడుస్తుంది. న్యూఢిల్లీ-వారణాసి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ (27422) ప్రతి శనివారం మినహా మిగిలిన రోజుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రయాణంలో నాలుగు స్టేషన్లలో ఆగుతుంది. అవి ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ సెంట్రల్, అలీగఢ్, ఘజియాబాద్ మాత్రమే. వీటిలో టికెట్ ధరలు థర్డ్ ఏసీ (3A) రూ.1,915, సెకండ్ ఏసీ (2A) రూ.2,470, ఫస్ట్ ఏసీ (1A) రూ.3,030గా ఉన్నాయి.

Vande Bharat Sleeper Trains Varanasi-Delhi Mumbai-Bengaluru Services to Start Today Things to Know
విజయవాడ, విశాఖ, తిరుపతి ప్రయాణికులకు రైల్వే అలర్ట్- ఈ రైళ్ల పొడిగింపు..!
విజయవాడ, విశాఖ, తిరుపతి ప్రయాణికులకు రైల్వే అలర్ట్- ఈ రైళ్ల పొడిగింపు..!

ముంబై-బెంగళూరు వందే భారత్ స్లీపర్

సెంట్రల్ ముంబై (CSMT)-సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు (SMVT) వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ (27651) నవంబర్ 2 నుంచి ప్రతి మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు నడుస్తుంది. అలాగే బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ (27652) నవంబర్ 3 నుంచి ప్రతి సోమవారం మినహా వారంలో ఆరు రోజులు నడుస్తుంది. ఈ మార్గంలో మొత్తం ఎనిమిది స్టేషన్లలో రైలు ఆగుతుంది. అవి ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, గుంతకల్, రాయచూర్, యాద్గిర్, కలబురగి, సోలాపూర్, పుణె, కల్యాణ్.
వీటి టికెట్ ధరలు థర్డ్ ఏసీ (3A) రూ.2,810, సెకండ్ ఏసీ (2A) రూ.3,630, ఫస్ట్ ఏసీ (1A) రూ.4,450 ఉన్నాయి.

Vande Bharat Sleeper Trains Varanasi-Delhi Mumbai-Bengaluru Services to Start Today Things to Know
రైలు ప్రయాణికులకు సుప్రీం గుడ్ న్యూస్..! ఆఫ్ లైన్ టికెట్లకూ ఇన్సూరెన్స్..!
రైలు ప్రయాణికులకు సుప్రీం గుడ్ న్యూస్..! ఆఫ్ లైన్ టికెట్లకూ ఇన్సూరెన్స్..!

ప్రయాణికులకు రూల్స్ ఇవే

ఈ రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లలోనూ కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారికే ప్రయాణానికి అనుమతిస్తారు. ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్, పాక్షికంగా కన్ఫమ్ అయినా అనుమతించరు. టికెట్ క్యాన్సిలేషన్ చూస్తే.. ప్రయాణానికి 72 గంటల కంటే ముందుగా అయితే టికెట్ ధరలో 25 శాతం, 72 గంటల నుంచి 8 గంటల మధ్య అయితే టికెట్ ధరలో 50 శాతం ఛార్జీ కోత విధించి రిఫండ్ ఇస్తారు. ప్రయాణానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు అయితే ఎలాంటి రీఫండ్ ఇవ్వరు. వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఐఆర్‌సీటీసీ ఉచితంగా ఒక లీటర్ రైల్ నీర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్, న్యూస్ పేపర్ అందిస్తుంది. ప్రయాణించే దూరం, ఎక్కే స్టేషన్, దిగే స్టేషన్ ఆధారంగా ప్రయాణికులకు ఆహారం ఇస్తారు. అలాగే వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణించే వారు ఫస్ట్ ఏసీ (1A) అయితే 70 కిలోలు, సెకండ్ ఏసీ (2A) అయితే 50 కిలోలు, థర్డ్ ఏసీ (3A) అయితే 40 కిలోలు మాత్రమే అనుమతిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+