వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ శాఖాలేని ముఖ్యమంత్రిగా రికార్డు: ఢిల్లీ కేబినెట్‌లో పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాచరణలోకి దిగిపోయారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. సోమవారం ఉదయం ఆయన సచివాలయంలోని తన ఛాంబర్‌లో నిరాడంబరంగా బాధ్యతలను స్వీకరించారు. అక్కడితో ఆగలేదు. మధ్యాహ్నానికి తన మంత్రివర్గ సహచరులకు శాఖలను కూడా కేటాయించేశారు. తాను మాత్రం ఏ శాఖను కూడా తీసుకోలేదు. శాఖల్లేని ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.

సీఎంగా మూడోసారి ప్రమాణం: పాటపడిన అరవింద్ కేజ్రీవాల్(వీడియో)సీఎంగా మూడోసారి ప్రమాణం: పాటపడిన అరవింద్ కేజ్రీవాల్(వీడియో)

ప్రాధాన్యత గల ఢిల్లీ జల మండలి శాఖను సత్యేంద్ర జైన్‌కు కేటాయించారు. పర్యావరణ మంత్రిత్వ శాఖను గోపాల్ రాయ్‌కు అప్పగించారు. కాలుష్య నియంత్రణ సంబంధిత కార్యకలాపాలన్నీ గోపాల్ రాయ్ పరిధిలోకి వస్తాయి. ఇదివరకు ఈ శాఖ కైలాష్ గెహ్లాట్ ఆధీనంలో ఉండేది. మహిళా, శిశు సంక్షేమ శాఖను రాజేంద్ర పాల్ గౌతమ్‌కు కేటాయించారు. అంతకుముందు ఈ శాఖను ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పర్యవేక్షించారు.

Delhi Cabinet Portfolios Finalised: Chief Minister Kejriwal Not to Hold Any Portfolio

Recommended Video

Arvind Kejriwal To Take Oath As Delhi CM @ Ramlila Maidan On February 16 | Oneindia Telugu

కాగా- మనీష్ సిసోడియా, ఇమ్రాన్ హుస్సేన్‌లకు మంత్రిత్వ శాఖలను ఇంకా కేటాయించాల్సి ఉంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది. సాయంత్రానికి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులకు శాఖలను కేటాయించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం.. తాను ఏ శాఖనూ తీసుకోలేదు. అన్నింటిపైనా ఆయన పర్యవేక్షణ ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

English summary
Portfolio allocation in Delhi government was finalised on Monday, 17 February, soon after Arvind Kejriwal took charge as the Chief Minister at Delhi Secretariat. While Kejriwal will not be taking charge of any department, the Delhi Jal Board (DJB) will be under Satyendra Kumar Jain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X