వార్నీ.. ఇదేం పని? ఆ గుహ నిండా ఫోన్లు.. ల్యాప్‌టాప్‌లే!
ఢిల్లీలో మోతీభాగ్‌లో ఓ ఆరుగురు దొంగలు తాము దొంగిలించిన వస్తువుల్ని అక్కడికి సమీపంలో సుమారు 50 మీటర్ల లోతున ఉండే ఓ గుహలో భద్రపరుస్తున్నారు.
న్యూఢిల్లీ: దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి విచారించడంతో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. ఒకటి.. రెండు కాదు.. గుట్టలు గుట్టలుగా ఫోన్లు.. ల్యాప్‌టాప్‌లు బయటపడ్డాయి.
ఢిల్లీలోని మోతీభాగ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనుమానితులుగా భావిస్తున్న ఓ ఆరుగురు వ్యక్తులు.. తాము దొంగిలించిన వస్తువుల్ని అక్కడికి సమీపాన సుమారు 50 మీటర్ల లోతున ఉండే ఓ గుహలో భద్రపరుస్తున్నారు.

పోలీసుల నుంచి తప్పించుకునేందకు కూడా ఈ దొంగలు గత కొద్ది రోజులుగా అక్కడే మకాం వేస్తున్నారు. ఈ గుహ ప్రవేశ ద్వారం చాలా చిన్నదిగా ఉండటమేకాక ఇది జనావాసానికి దూరంగా ఉండటంతో ఎవరికీ దీని గురించి అనుమానం రాలేదు.
అయితే బుధవారం వీరిని పోలీసులు అరెస్టు చేసి విచారించగా ఈ నిజాలన్నీ వెలుగులోకి వచ్చాయి. గుహలో ఓ టార్చిలైటుతో పాటు ఖాళీ బీరు సీసాలు, ఎవరైనా వెంబడిస్తే తప్పించుకోవడానికి అనువైన పరికాలు ఉన్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications