వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ చలో.: ఎర్రకోటపై గురి పెట్టిన దీదీ మమతా బెనర్జీ

By Pratap
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎర్రకోటపై గురిపెట్టారు. ఇందులో భాగంగా ఆమె ఢిల్లీ చలో నివాదం ఇచ్చారు. దేశరాజధానిలో అడుగు పెడుతామని ఆమె అన్నారు.

కాషాయ పార్టీ పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి రావాలనుకుంటుంటే తాను గురి ఢిల్లీపై, ఎర్రకోటపై ఉందని ఆమె అన్నారు. తమ పార్టీకి దేశప్రజల శ్రేయస్సు తప్ప మరేమీ అవసరం లేదని అన్నారు

వారికి రివార్డు లేదా ఉద్యోగం

వారికి రివార్డు లేదా ఉద్యోగం

ప్రార్థనా స్థలాల్లో మాంసాన్ని విసురుతూ భారతీయ జనతా పార్టీ (బిజెపి), రాష్ట్రీయ స్వయం సేవక్ సఘ్ (ఆర్ఎస్ఎస్) రాష్ట్రంలో మత ఘర్షణలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని ఆమె అన్నారు. ప్రార్థనా స్థలాల్లో మాంసం వేసేవారిని పట్టుకుంటే వేయి రూపాయల నగదు బహుమతి గానీ, ఉద్యోగం గానీ ఇస్తామని ఆమె ప్రకటించారు.

మాది సుభాష్ బోస్ నినాదమే

మాది సుభాష్ బోస్ నినాదమే

తమ పార్టీకి దేశ శ్రేయస్సే ముఖ్యమని, తమ లక్ష్యం ఢిల్లీలోని ఎర్రకోట అని, సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన చలో ఢిల్లీ నినాదాన్ని తాము విశ్వసిస్తామని మమతా బెనర్జీ చెప్పారు. భవిష్యత్తులో బెంగాల్ దేశాన్ని, ప్రపంచాన్నీ గెలుస్తుందని అన్నారు.

బెంగాల్ అంటే ఇదీ..

బెంగాల్ అంటే ఇదీ..

బెంగాల్ తన కోసం ఏమీ తీసుకోదు గానీ ప్రతి ఒక్కరి పక్కన నిలబడుతుందని, ప్రతి ఒక్కరినీ తన వెంట తీసుకుని వెళ్లి పోరాడుతుందని చెప్పారు. బెంగాల్ ఏం చేస్తుందో ప్రతి ఒక్కరికీ చూపిస్తామని అన్నారు.

అదీ నేరమవుతుంది...

అదీ నేరమవుతుంది...

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిపై విమర్శలు ఎక్కుపెడుతూ మమతా బెనర్జ డబ్బులు ఇచ్చి పేద ప్రజలను కొనుగోలు చేస్తోందని, మత ప్రాతిపదికపై ప్రజలను విభజిస్తోందని అన్నారు. బీదవారిగా ఉండడం, పేద కుటుంబంలో పుట్టడం నేరం కాదని, వారిని కొనడానికి ప్రయత్నించడం నేరమని ఆమె అన్నారు మత ఘర్షణలు సృష్టించి ప్రజలను తమ వైపు తిప్పుకోవాలనుకోవడం నేరమని అన్నారు.

వారి కొత్త కుట్ర ఇదీ..

వారి కొత్త కుట్ర ఇదీ..

బిజెపి, ఆర్ఎస్ఎస్ ఇటీవలే కొత్త కుట్రను మొదలు పెట్టాయని మమతా బెనర్జీ అన్నారు. కొంత మందికి డబ్బులు ఇచ్చి దేవాలయాల్లో, మసీదుల్లో మాంసం వేయాలని చెబుతున్నారని, ఇదీ కుట్ర అని, కావాలని మత కల్లోలాను సృష్టించాలని అనుకుంటున్నారని ఆమె అన్నారు.

English summary
Giving out the slogan of 'Delhi Chalo', West Bengal Chief Minister Mamata Banerjee vowed to imprint her party's footsteps in the national capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X