కేజ్రీవాల్‌ను ఫాలో అవుతున్న మోడీ: ఢిల్లీ సీఎం థ్యాంక్స్
న్యూఢిల్లీ: దాదాపు 70 లక్షల మందికి పైగా ఫాలోవర్లను తన ట్విట్టర్ ఖాతాలో కలిగివున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఖాతాలోకి ఇప్పుడు మోస్ట్ హై ప్రొఫైల్ వ్యక్తి వచ్చి చేరారు. కేజ్రీవాల్ ఫాలోవర్‌గా ప్రధాని నరేంద్ర మోడీ జాయిన్ అయ్యారు.
ఈ విషయాన్ని కేజ్రీవాల్ స్వయంగా వెల్లడించారు. 'నన్ను ఫాలో అవుతున్నందుకు థ్యాంక్యూ సర్. హోలీ శుభాకాంక్షలు. భవిష్యత్తులో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య మరింత మంచి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశారు.

కాగా, ప్రధాని మోడీ ప్రస్తుతం దాదాపు 1400 మందిని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు. ఆయన్ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 1.88 కోట్లుగా ఉండగా, ఇండియాలో ఆయనకన్నా ముందు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 2 కోట్ల మంది ఫాలోవర్లతో నెంబర్ వన్‌గా నిలిచారు.
గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత పలుమార్లు నరేంద్రమోడీ, కేంద్రపభ్రుత్వం విమర్శలు, ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
.@narendramodi Sir, thank u for following me. Happy Holi. आज गिले शिकवे भूलने का दिन है। Hope better Centre-Delhi cooperation in future
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 24, 2016












Click it and Unblock the Notifications