వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భద్రతా వైఫల్యం: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై కారంపొడితో దాడి

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఢిల్లీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి కారంపొడితో దాడి చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని సెక్రటేరియట్‌లో సీఎం కార్యాలయం బయట చోటుచేసుకుంది. దాడి చేసిన వ్యక్తిని అనిల్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరవింద్ కేజ్రీవాల్ తన కార్యాలయంలో సమావేశాలు ముగించుకుని భోజనం చేసేందుకు మూడో అంతస్తులోని తన కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో అనిల్ ఆయనపై దాడి చేశారు.

అరవింద్ కేజ్రీవాల్ పాదాలకు ముక్కుతున్నట్లుగా నటించిన అనిల్ ఆ వెంటనే తనతో పాటు తెచ్చుకున్న కారంపొడితో కేజ్రీవాల్ ముఖంపై విసిరారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వెంటనే పోలీసులు అనిల్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఒక వ్యక్తి సీఎం ఆఫీసులోకి కారంపొడి ఎలా తీసుకురాగలిగాడని ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి భద్రత కల్పించడంలో కేంద్రం విఫలమైందని ఆమె ఆరోపించారు.

Delhi CM Arvind Kejriwal attacked with chilli powder; suspect arrested

ఢిల్లీ పోలీసులు తమ విధులు నిర్వర్తించడంలో వరసగా విఫలమవుతున్నారని అల్కా లాంబా ధ్వజమెత్తారు. కేంద్రం ఆదేశాల మేరకే ఢిల్లీ పోలీసులు నడుచుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. ఘటనపై పలువురు రాజకీయ నేతలు స్పందించారు. అనిల్ జేబులో నుంచి కింద పడిన కారంపొడి తిరిగి కేజ్రీవాల్‌ ముఖంపైకి ఎలా వెళుతుంది ఎన్సీపీ నేత అని ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే జరిగిన ఘటనపై ఢిల్లీ బీజేపీ స్పందించింది. ఈ ఘటనను ఖండించింది. ఇలాంటి ఘటనలను సహించరాదని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి అన్నారు. వెంటనే విచారణకు ఆయన డిమాండ్ చేశారు.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal was on Tuesday attacked with chilli powder in Delhi Secretariat. The incident took place around 2 pm when the AAP convenor left his chamber to have lunch.According to the reports, the accused identified as Anil Kumar Hindustani has been taken into custody. During the incident, Kejriwal's spectacles got damaged. A sachet of chilli powder was also found outside Kejriwal's chamber in the Delhi Secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X